Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నార్త్‌ఈస్ట్ యునైటెడ్ vs జంషెడ్‌పూర్: మ్యాచ్ టైమింగ్స్.. టీమ్ వివరాలు!!

గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21‌లో భాగంగా శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎస్‌సీ, జంషెడ్‌పూర్ ఎస్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐఎస్‌ఎల్ టోర్నీలో ఇది 32వ మ్యాచ్. ఈరోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గోవాలోని వాస్కో డిగామాలోని తిలక్ మైదానంలో జరుగుతుంది. ఆసక్తిగల ఫుట్‌బాల్ అభిమానులు డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. రిలయన్స్ జియో వినియోగదారులు 'జియో టీవీ'లో మ్యాచ్ వీక్షించవచ్చు.

ఈ మ్యాచులో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎస్‌సీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఆడిన ఆరు మ్యాచులలో రెండు విజయాలు అందుకుని.. నాలుగు డ్రా చేసుకుంది. 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే.. బెంగళూరును వెనక్కినెట్టి మూడో స్థాననానికి చేరుకోనుంది. మరోవైపు జంషెడ్‌పూర్ ఆడిన ఆరు మ్యాచులలో ఒక విజయం, ఒక ఓటమిని చవిచూసింది. నాలుగు డ్రాలతో 7 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. జంషెడ్‌పూర్ పట్టికలో 7వ స్థానంలో ఉంది.

జట్లు:
నార్త్‌ఈస్ట్ యునైటెడ్: గుర్మీత్ సింగ్, అశుతోష్ మెహతా, బెంజమిన్ లాంబోట్, డైలాన్ ఫాక్స్, గుర్జిందర్ కుమార్, నిన్‌తోయింగన్బా మీటీ, ఖాస్సా కమారా, లాలెంగ్‌మావియా మచాడో, విపి సుహైర్.

జంషెడ్‌పూర్: టిపి రెహనేష్, సందీప్ మండి, పీటర్ హార్ట్లీ, స్టీఫెన్ ఈజ్, రికీ లల్లవ్‌మావ్మా, మొబాషీర్ రెహ్మాన్, అలెక్స్ లిమా, జాకిచంద్ సింగ్, ఐజాక్ వన్మల్సావ్మా, విలియం లాల్నున్ఫెలా, నెరిజస్ వాల్స్కిస్.


ముగిసిన రెండో రోజు ఆట.. తిప్పేసిన అశ్విన్‌.. అదరగొట్టిన ఉమేశ్‌.. భారత్ ఆధిక్యం 62!


Story first published: Friday, December 18, 2020, 19:08 [IST]
Other articles published on Dec 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+