Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: ముంబై సిటీ నాలుగో విక్టరీ

ISL 2020-21: Mumbai City FC Defeat Chennaiyin FC 2-1 To Extend Unbeaten Run

బాంబోలిమ్(గోవా): ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 2-1తో చెన్నయిన్ ఎఫ్‌సీ (సీఎఫ్‌సీ)ని ఓడించింది.

ఒక గోల్‌తో వెనుకడినప్పటికీ అద్భుతంగా పుంజుకొని విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన చెన్నయిన్.. ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. అటాకింగ్ గేమ్ ఆడిన సీఎఫ్‌పీ 40వ నిమిషంలో ఫస్ట్ గోల్ కొట్టింది.

రైట్ ఫ్లాంక్ నుంచి లలియాంజ్వల చాంగ్టే ఇచ్చిన బ్రిలియంట్ పాస్‌ను జాకుబ్ సిల్వెస్టర్ నెట్‌లోకి కొట్టడంతో చెన్నయిన్ 1-0తో లీడ్‌లోకి వచ్చింది. అయితే.. ఐదు నిమిషాల్లోనే ముంబై స్కోరు సమం చేసింది. ఫస్టాఫ్ చివర్లో హ్యూగో బౌమస్ కార్నర్ నుంచి బాక్స్‌లోకి తీసుకొచ్చిన బాల్‌ను విశాల్ కైత్ షాట్ కొట్టగా మిస్సయింది.

కానీ, బాల్ నెట్ వద్ద అన్‌మార్క్‌గా ఉన్న హెర్నర్ శాంటానా దగ్గర పడగా అతను ఈజీ గోల్ కొట్టాడు. ఇక సెకండాఫ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 75వ నిమిషంలో ఆడమ్ లెఫొండ్రే హెడ్డర్‌తో సెకండ్ గోల్ చేసిన ముంబై లీడ్‌లోకి వచ్చింది. ఆపై, చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకొని గెలిచింది.

Story first published: Thursday, December 10, 2020, 11:46 [IST]
Other articles published on Dec 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+