Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: ప్చ్.. మళ్లీ ఓడిన హైదరాబాద్

ISL 2020-21: Late Angulo, Pandita Goals Hand Goa 2-1 win Against Hyderabad

మార్గో: ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్‌‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 2-1తో హైదరాబాద్‌ను ఓడించింది. గోవా తరఫున పండితా(87వ నిమిషం), ఇగోర్ అంగులో(90వ నిమిషం) గోల్స్ చేయగా.. అరిడానే సాంటానా(58వ నిమిషం) హైదరాబాద్‌కు ఏకైక గోల్ అందించాడు.

మ్యాచ్ ప్రారంభంలో ఇరుజట్లు బాల్‌పై ఆధిపత్యం కోసం హోరాహోరీగా పోరాడాయి. కానీ గోల్స్ చేసే అవకాశాలను మాత్రం సృష్టించుకోలేకపోయాయి. హైదరాబాద్‌కు ఒకటి, రెండు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. దీనికితోడు గోవా డిఫెండర్లు.. ప్రత్యర్థి అటాకింగ్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఫలితంగా ఫస్ట్ హాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. సెకండాఫ్‌లో పూర్తి భిన్నంగా ఆడిన హైదరాబాద్‌కు 58వ నిమిషంలో కెప్టెన్ సాంటానా.. ఆశీష్ రాయ్ అందించిన సూపర్ పాస్‌ను నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో హైదరాబాద్ 1-0 లీడ్‌లోకి వెళ్లింది.

ఇక్క ఇక్కడి నుంచి గోల్ కోసం గోవా చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ చివరి నిమిషంలో హైదరాబాద్ నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకుంది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ ఇచ్చుకుని ఓటమిని కొని తెచ్చుకుంది. ప్రస్తుతం గోవా 14 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉండగా, హైదరాబాద్ 9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Story first published: Thursday, December 31, 2020, 8:18 [IST]
Other articles published on Dec 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+