Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: హైదరాబాద్ ఎఫ్‌సీ కెప్టెన్‌గా టీమిండియా డిఫెండర్

ISL 2020-21: India international Adil Khan named Hyderabad FC captain

గోవా: జట్టులో భారీ మార్పులతో ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ 2020-21 సీజన్ బరిలోకి దిగిన హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు.. కెప్టెన్‌గా భారత అంతర్జాతీయ ఫుట్‌బాలర్ ఆదిల్ ఖాన్‌ను నియమించింది. 32 ఏళ్ల ఆదిల్ ఖాన్ భారత టీమ్ డిఫెండర్. 2012లో అంతర్జాతీయ పుట్‌బాల్‌లోకి అరంగేట్రం చేసిన ఖాన్.. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కోల్‌కతా వేదికగా కిక్కిరిసిన మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన 2022 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో కాపాడాడు. దాంతో యావత్ దేశ దృష్టిని ఆకర్షించాడు.

టీమిండియా మాజీ గోల్ కీపర్ సుబ్రతా పాల్, స్పానిష్ స్ట్రైకర్ అరిడేన్ సాంటానా, బ్రెజిలియన్ జోవో విక్టర్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని, ఖాన్ గైర్హాజరీలో వీరిలో ఒకరు జట్టును లీడ్ చేస్తారని హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్ మాన్యుయెల్‌ మార్కజ్‌ తెలిపాడు. 'ఆదిల్ ఖాన్,అరిడేన్ సాంటానా, సుబ్రాత్ పాల్, జోవో విక్టర్‌లు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టీమ్ మైదానంలో జట్టును లీడ్ చేస్తుంది. ఫస్ట్ కెప్టెన్ లేనప్పుడు రెండో కెప్టెన్ బాధ్యత తీసుకుంటాడు.'అని హైదరాబాద్ ఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, ఇది చాలా పెద్ద బాధ్యతని ఆదిల్ ఖాన్ తెలిపాడు. గత సీజన్ నుంచి చాలా కష్టపడుతున్నామని తెలిపాడు. హైదరాబాద్ ఎఫ్‌సి అరంగేట్ర సీజన్‌లోనే జట్టులో చేరిన ఆదిల్.. 2023 ఒప్పందం చేసుకున్నాడు.

Story first published: Monday, November 23, 2020, 21:47 [IST]
Other articles published on Nov 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+