Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: హైదరాబాద్ మ్యాజిక్.. ఒకే నిమిషంలో రెండు గోల్స్!

ISL 2020-21: Hyderabad FC beat SC East Bengal In Five-Goal Thriller

పనాజీ: స్టార్ ప్లేయర్ అరిడానె శాంటానా ఒకే నిమిషంలో రెండు గోల్స్‌తో మ్యాజిక్ చేయడంతో ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం తిలక్ మైదాన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 3-2తో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్‌ను ఓడించింది. గతేడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్.. ఈ సారి అదరగొడుతుంది.

జట్టులో కొన్ని మార్పులతో ఈ సీజన్ బరిలోకి దిగిన హైదరాబాద్ ఎఫ్‌సీ.. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు డ్రాలతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో నిలిచింది.

ఇక ఆట మొదలైన 26వ నిమిషంలో బెంగాల్ ప్లేయర్ జాక్సెస్ మఘోమ గోల్ చేసి జట్టుకు 1-0తో లీడ్ అందించాడు. ఈ సీజన్‌లో ఈస్ట్ బెంగాల్‌కు ఇదే ఫస్ట్ గోల్ కావడం విశేషం. ఫస్టాప్‌లో హైదరాబాద్‌ను నిలువరించిన ఆ జట్టు సెకండాఫ్‌ను కూడా సానుకూలంగానే ప్రారంభించి విజయంపై కన్నేసింది. కానీ, 56వ నిమిషంలో ఆ జట్టు ఆశలపై అరిడానె నీళ్లు కుమ్మరించాడు.

తొలుత ఫ్రీ కిక్‌కు యాసిర్ అందించిన బాల్‌ను హెడర్‌తో నెట్‌లోకి పంపాడు. 39 సెకండ్ల తర్వాత లిస్టన్ ఇచ్చిన లాంగ్ పాస్‌ను ఒడుపుగా గోల్ పోస్ట్‌లోకి కొట్టి ప్రత్యర్థికి షాకిచ్చాడు. 12 నిమిషాల తర్వాత హాళి చరణ్(68ని) కొట్టిన గోల్‌తో హైదరాబాద్ 3-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. 81వ నిమిషంలో మఘోమా సెకండ్ గోల్ చేసినా ఈస్ట్ బెంగాల్ లీగ్‌లో విజయాల ఖాతా తెరవలేకపోయింది.

Story first published: Wednesday, December 16, 2020, 8:37 [IST]
Other articles published on Dec 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+