
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మాదిరే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020 కూడా క్రీడా అభిమానులను అలరిస్తోంది. ఆరంభ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు అయినా.. ఆ తర్వాత జట్లు రఫ్ఫాడిస్తున్నాయి. హోరాహోరి పోరులతో అభిమానులకు కావాల్సిన మజానందిస్తున్నాయి. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఒడిశా ఎఫ్‌సీ, జంషెడ్ పూర్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.
ఇక సోమవారం రాత్రి గోవా ఫుట్‌బాల్ క్లబ్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముఖా ముఖి రికార్డులో నార్త్‌ఈస్ట్‌పై లీడ్‌లో ఉన్న గోవా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఏడేళ్ల ఐఎస్‌ఎల్ చరిత్రలో టూటైమ్ రన్నరప్ ఎఫ్‌సీ గోవా 110 మ్యాచ్‌ల్లో 51 గెలుపొందగా.. గత సీజన్ సెమీఫైనలిస్ట్ నార్త్ ఈస్ట్ 100 మ్యాచ్‌ల్లో 28సార్లు విజయాన్నందుకుంది. ఇక ఈ రెండు జట్లు ఓవరాల్‌గా 12 సార్లు తలపడగా.. గోవా ఐదు విజయాలతో లీడ్‌లో ఉంది. మరో ఐదు సార్లు డ్రా కాగా.. 2 సార్లు నార్త్ ఈస్ట్ యునైటెడ్ గెలుపొందింది.
చివరి 5 ఐదు మ్యాచ్‌ల్లో రెండు సార్లు గోవా విజయం సాధించగా మూడు సార్లు డ్రా అయింది. ముఖా ముఖి పోరులో గోవా మొత్తం 24 గోల్స్ చేయగా.. నార్త్ ఈస్ట్ 14 గోల్స్ సాధించింది. బెంగళూరుతో ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో గోవా డ్రా చేసుకుంది. కానీ ముంబైతో తర్వాతి జరిగిన మ్యాచ్ ఓటమిపాలైంది. మరోవైపు నార్త్ ఈస్ట్.. ముంబైపై గెలిచి విజయాన్నందుకుంది. ఆ తర్వాత కేరళ బ్లాస్టర్స్‌తో డ్రా చేసుకుంది.