Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: నక్క తోక తొక్కిన స్కాటిష్ ఫుట్‌బాలర్.. అరంగేట్ర సీజన్‌లోనే సారథ్య బాథ్యతలు!

ISL 2020-21: Danny Fox to lead SC East Bengal in debut season

పనాజీ: స్కాటిష్ డిఫెండర్ డాన్నీ ఫాక్స్ తన అరంగేట్ర సీజన్‌లోనే ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ రాబీ ఫౌలర్ గురువారం మీడియాకు తెలిపాడు. ఐరిష్ మిడ్‌ఫీల్డర్ అంటోనీ పిల్కింగ్టన్ డ్యానీ ఫాక్స్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడన్నాడు. 'గత కొంత కాలంగా డాన్నీ ఫాక్స్ గురించి బాగా తెలుసుకున్నాను. అతనికి నాయకత్వ లక్షణాలున్నాయనేవి నా గట్టి నమ్మకం.

మా ట్రైనింగ్ టైమ్‌ రెండు వారాల్లోనే అతను ఇతర ఆటగాళ్ల నమ్మకాన్ని సంపాదించాడు. మా జట్టు మొత్తం సారథులతోనే నిండి ఉంది. వారిలో డానీ కూడా ఒకడు. నేను అతన్ని పూర్తిగా నమ్ముతున్నా. ప్రతిష్టాత్మకమైన మా ఫస్ట్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు నడిపించే సత్తా అతనికి ఉంది. అతనితో నేను చాలా సేపు మాట్లాడాను. జట్టుకు విజయాన్నందించాలనే ఆకలితో ఉన్నాడు. 'అని ఇంగ్లండ్ లెజెండ్, బెంగాల్ కోచ్ రాబీ ఫౌలెర్ తెలిపాడు. ఇక ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్లలో ఫౌలర్ ఒకడనే విషయం తెలిసిందే.

ఇక కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యతని, తనపై పెట్టిన నమ్మకాన్ని కోల్పోనని డాన్నీ ఫాక్స్ తెలిపాడు. 'ఇది చాలా పెద్ద బాధ్యత. జట్టును నడిపించేందుకు సిద్ధంగా ఉన్నా.రాబీ ఫౌలర్ నాపై తన నమ్మకాన్ని చూపించాడు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచను. జట్టుతో బాగా కలిసిపోయా'అని ఫాక్స్ చెప్పుకొచ్చాడు. శుక్రవారం కోల్‌కతాకే చెందిన ఏటీకే మోహన్ బగాన్ జట్టుతో ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరును ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

Story first published: Thursday, November 26, 2020, 19:53 [IST]
Other articles published on Nov 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+