ISL 2020-21: చెన్నాయిన్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ డ్రా

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020లో చెన్నాయిన్ ఫుట్‌బాల్ క్లబ్ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగిన రెండో మ్యాచ్‌ను 0-0తో చెన్నాయిన్ 'డ్రా' చేసుకుంది. ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే డిఫెండర్లు మాత్రం ఆకట్టుకున్నారు. సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
తొలి అర్ధభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడంతో గోల్ నమోదు కాలేదు. చెన్నాయిన్ జట్టు ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గేమ్‌లో దక్కిన పలు అవకాశాలను ఇరు జట్లు చేజార్చుకున్నాయి. గేమ్ చివరి దాకా ఇరు జట్ల గోల్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కేరళ బ్లాస్టర్ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి మరో రెండింటిలో డ్రా చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications