ISL 2020-21: బిపిన్ హ్యాట్రిక్.. ముంబై సిటీ విక్టరీ

బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ మరో గ్రాండ్ విక్టరీ సాధించింది. బిపిన్ సింగ్(38వ నిమిషం, 47వ నిమిషం, 86వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 6-1తో ఒడిశా ఎఫ్‌సీని చిత్తుగా ఓడించింది. బిపిన్ ఈ సీజన్‌లో ఫస్ట్ హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్‌గా నిలవగా.. బార్త్‌లోన్యూఒబెచె(13వ నిమిషం), గోడార్ట్(44వ నిమిషం) ముంబైకి గోల్స్ అందించారు.
9వ నిమిషంలో దొరికిన పెనాల్టీ కార్నర్‌ను డిగో మొరిచ్ గోల్‌గా మలచడంతో ఒడిశా 1-0తో మ్యాచ్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. కానీ నాలుగు నిమిషాల తర్వాత ఒబెచె గోల్ సాధించడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత ముంబై స్ట్రయికర్లు వరుస పెట్టి గోల్స్ కొట్టి ఒడిశాకు మరో చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ ఫినిష్ చేశారు.
Story first published: Thursday, February 25, 2021, 10:37 [IST]
Other articles published on Feb 25, 2021
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications