న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ISL 2020-21: నార్త్‌ఈస్ట్ ఏడో డ్రా.. వరుస పరాజయాలకు బెంగళూరు బ్రేక్!

 ISL 2020-21: Bengaluru FC ends losing streak, draws 1-1 with NorthEast United

వాస్కో: ఆరంభంలో చెలరేగినా... మ్యాచ్ ముగింపులో విఫలమవుతున్న నార్త్‌ఈస్ట్ యునైటెడ్ టీమ్ మరో డ్రాను ఖాతాలో వేసుకుంది. మంగళవారం బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. నార్త్‌ఈస్ట్ తరఫున లూయిస్ మకాడో(27వ నిమిషం) గోల్ చేయగా, రాహుల్ బేకీ(50వ నిమిషం) బెంగళూరుకు గోల్ అందించాడు.

ఈ సీజన్‌లో నార్త్‌ఈస్ట్‌కు ఇది ఏడో డ్రా కావడం విశేషం. నాలుగు వరుస పరాజయాల తర్వాత బెంగళూరు డ్రాతో బయటపడింది. ఇరు జట్లు మూడు మార్పులతో బరిలోకి దిగాయి. ఆరంభంలో బెంగళూరు పటిష్టమైన డిఫెన్స్‌తో ముందుకెళ్లినా.. గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. అయితే ఫీల్డ్‌లో చురుకుగా కదిలిన మకాడో బ్రిలియంట్ స్ట్రయిక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫెడ్రిక్ గలెగో ఇచ్చిన పాస్‌ను నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపి నార్త్‌ఈస్ట్‌కు 1-0 లీడ్ అందించాడు. సెకండ్ హాఫ్‌లో పదును పెంచిన బెంగళూరు కౌంటర్ అటాకింగ్‌తో అదరగొట్టింది. ఈ క్రమంలో రాహుల్ కొట్టిన లాంగ్ పాస్ గోల్‌గా మారడంతో స్కోర్ సమమైంది.

Story first published: Wednesday, January 13, 2021, 9:08 [IST]
Other articles published on Jan 13, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X