Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020-21: ఏటీకే మోహన్ బగాన్ హ్యాట్రిక్ విక్టరీ!

ISL 2020-21: ATK Mohun Bagan nicked a 1-0 win over Odisha FC

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ 1-0 ఒడిశా ఎఫ్‌సీని ఓడించింది. ఇంజ్యూరీటైమ్ (90+5)వ నిమిషంలో రాయ్‌ కృష్ణ గోల్‌తో బగాన్‌ జట్టు గెలుపొందింది. తొలి అర్ధభాగంలో బగాన్‌ జట్టుకు గోల్‌ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

ఒడిశా కూడా పలు అవకాశాలను వృథా చేసుకొంది. దీంతో ఫస్టాప్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ గోల్‌ కోసం ఇరు జట్లూ హోరా హోరీగా పోరాడాయి. అయితే ఇంజ్యూరీ టైమ్‌లో రాయ్‌ కృష్ణ చేసిన గోల్‌తోనే మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ దక్కించుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఏటీకే మోహన్ బగాన్ 9 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మూడింటిలో రెండు గెలిచిన ముంబై సిటీ 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఒక్కో విజయంతో ఓటమెరుగని నార్త్ ఈస్ట్, హైదరాబాద్ టీమ్స్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Story first published: Friday, December 4, 2020, 8:16 [IST]
Other articles published on Dec 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+