
హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్ చూసేందుకుగాను రష్యా వెళ్లిన ఓ భారత అభిమాని అక్కడ జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. వివరాల్లోకి వెళితే... శనివారం సోచి వేదికగా పోర్చుగల్-ఉరుగ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్ చూసి వస్తున్న సమయంలో భారత అభిమాని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు భారత అధికారులు వెల్లడించారు. రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మృతిచెందిన తొలి విదేశీ అభిమానిగా నిలిచాడు. బాధితుడిని ఆదిత్య రంజన్‌గా గుర్తించారు.
'కూబన్ ప్రాంతంలో ఓ భారత ఫుట్‌బాల్ అభిమాని మరణించాడు' అని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడి కుటుంబంతో ఎంబసీ టచ్‌లో ఉన్నదని ఆయన చెప్పారు. సోమవారం మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆడ్లెర్-క్రాస్నయా దారిలో కారును ఓ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు మరో భారతీయ సిటిజన్ మరణించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్‌ఐఏ నోవోస్తి తెలిపింది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఇండియన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.