న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలవండి: వరల్డ్ కప్‌లో పోస్టర్ కలకలం

By Nageshwara Rao
In Russia, a plea to support Iranian women to enter stadiums

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఓ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా అన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా ముగిశాయి. శుక్రవారం రాత్రి సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియంలో ఇరాన్-మొరాకో జట్లు తలపడ్డాయి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో "స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను వీక్షించేలా ఇరాన్ దేశానికి చెందిన మహిళలకు మద్దతుగా నిలవండి" అనే నినాదంతో కూడిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి ఇరాన్ దేశంలో పురుషులు ఆడే క్రీడలను వీక్షించేందుకు మహిళలకు మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతిలేదు.

In Russia, a plea to support Iranian women to enter stadiums

దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారికి అనుమతిని అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు మహిళా క్రీడాకారిణులు ఆట ఆడే సమయంలో లేదా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గానీ పురుషులు ఆ స్టేడియాలకు వెళ్లి తిలకించడంపైనా కూడా అక్కడ నిషేధం అమలులో ఉంది.

ఇలాంటి కఠిన చట్టాల నుంచి మహిళలకు స్వేచ్ఛ నివ్వాలని కోరుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని మహిళా సంఘాలు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాయి. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇరాన్ మ్యాచ్ సందర్భంగా ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలవాలని ప్రపంచకప్ వేదికగా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

మొరాకోతో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఫ్రీకిక్ రూపంలో అదృష్టం వరించడంతో ఇరాన్ 1-0తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంతి 53 శాతం ఉరుగ్వే ఆటగాళ్ల ఆధీనంలోనే ఉన్నా.. ఈజిప్ట్ డిఫెండర్లు వారిని నిలువరించడంలో విజయవంతమయ్యారు.

ఉరుగ్వే ఆటగాళ్లు గోల్‌పోస్టుపై 14 సార్లు దాడులు చేయగా.. ఈజిప్ట్ ఆటగాళ్లు కేవలం 8 సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్‌పోస్టును సమీపించారు. ఇరాన్‌లో ఏదైనా క్రీడలో పాల్గొనాలంటే బురఖా ధరించాలనే నిబంధన ఉండటంతో భారత్‌కు చెందిన కొంతమంది మహిళా క్రీడాకారిణులు ఆదేశంలో జరిగే టోర్నీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 16, 2018, 15:50 [IST]
Other articles published on Jun 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X