Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలిసిపోయా.. అది నా వల్ల కాదు: లియోనెల్ మెస్సీ

తాను తీవ్రంగా అలసిపోయానని, ఆలోచించే శక్తి తనకు లేదని అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అన్నాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ (18) చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన మెస్సీ.. ఈ మధుర క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నానని తెలిపాడు.

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్-జే పోరులో అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రియాను ఓడించింది. లియోనెల్ మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ దశకు అర్హత సాధించింది.

చరిత్ర సృష్టించిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం!

చరిత్ర సృష్టించిన మెస్సీ.. అర్జెంటీనా ఘన విజయం!

అలసిపోయానయ్యా..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మెస్సీ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో నమోదు చేసిన 18 గోల్స్‌లో ఏది అత్యుత్తమమని హోస్ట్ అడగ్గా.. అంతగా ఆలోచించే శక్తి తనకు లేదని బదులిచ్చాడు. 'నేను ప్రస్తుతం చాలా అలిసిపోయాను. నా శక్తి మొత్తం కోల్పోయాను. ఈ తరుణంలో నా ప్రపంచకప్ గోల్స్‌లో ఏది అత్యుత్తమమైనదో ఆలోచించడం కూడా కష్టంగా ఉంది. అయితే ఈ విజయం మాకు ఎంతో ఊరటనిచ్చింది. మున్ముందు రాబోయే మ్యాచ్‌లకు ప్రశాంతంగా సిద్ధమవడానికి ఇది తోడ్పడుతుంది.'అని మెస్సీ చెప్పుకొచ్చాడు.

I m Tired Lionel Messi Reacts After Breaking All-Time FIFA World Cup Goal Record vs Austria

మ్యాచ్ ప్రారంభంలో (9వ నిమిషంలో) పెనాల్టీ మిస్ చేయడంపై ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. బహుశా ఆ పెనాల్టీ స్కోర్ చేసి ఉంటే.. మిగిలిన రెండు గోల్స్ వచ్చేవి కావేమోనని చమత్కరించాడు.

వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్.. ఈమె ఎవరో తెలుసా?

వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్.. ఈమె ఎవరో తెలుసా?

కోచ్ ప్రశంసలు

అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని తమ కెప్టెన్‌ మెస్సీపై ప్రశంసల జల్లు కురిపించాడు. పెనాల్టీ మిస్ అవ్వడం ఒక దెబ్బేనని, కానీ మెస్సీ ఒక్కసారి పుంజుకుంటే, జట్టు మొత్తం ఉత్తేజితమవుతుందని తెలిపాడు. మరోవైపు ఆస్ట్రియా జట్టు కోచ్ రాల్ఫ్ రంగ్‌నిక్ తమ ఆటగాళ్ల ధైర్య సాహసాలను కొనియాడాడు.

అర్జెంటీనా కంటే ఎక్కువ సార్లు బంతిని వారి బాక్స్‌లోకి తీసుకెళ్లినప్పటికీ, ఫినిషింగ్‌లో విఫలమయ్యామని, అయితే తమ నాకౌట్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని తెలిపాడు. గ్రూప్-జెలో ఆస్ట్రియా తదుపరి మ్యాచ్‌లో అల్జీరియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది.


సరికొత్త రికార్డులు..

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మిరోస్లావ్ క్లోజ్ రికార్డును సమం చేసిన మెస్సీ.. తాజాగా ఆస్ట్రియాపై రెండు గోల్స్ చేసి 18 గోల్స్‌తో ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

జస్ట్ ఫోంటైన్ (1958), జైర్జినో (1970)ల తర్వాత వరుసగా 6 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన మూడో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు.

ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 7 పెనాల్టీలు తీసుకుని, 3 మిస్ చేసిన రికార్డు కూడా మెస్సీ పేరిట నమోదైంది.

Story first published: Tuesday, June 23, 2026, 9:32 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+