FIFA World Cup 2022: సాకర్ సమరం ఏ చానెల్‌లో వస్తుందంటే..? ఫ్రీగా ఎలా చూడాలంటే?

హైదరాబాద్: యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాకర్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఫిఫా ప్రపంచకప్ 2022కు తెరలేవనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ముస్లిం దేశమైన ఖతర్ వేదికగా జరగనుంది. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహిస్తుండగా.. ఖతర్ 22వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇస్తుంది. 29 రోజుల పాటు జరిగే ఈ సాకర్ సమరంలో 32 జట్లు 64 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 32 జట్లను మొత్తం 8 గ్రూప్‌లుగా విభించారు. 2018 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టుకు బ్రెజిల్, బెల్జీయం, అర్జెంటీనా జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది. ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు ఈ ప్రపంచకప్ చివరి కానుంది.

మొత్తం 8 గ్రూప్‌లు..
గ్రూప్ ఏ: ఖతర్, ఈక్వేడర్, సెనేగల్, నెదర్లాండ్స్
గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్
గ్రూప్ సీ: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
గ్రూప్ డీ: ఫ్రాన్స్, అస్ట్రేలియా, డెన్మార్క్, తునీషియా
గ్రూప్ ఈ: స్పెయిన్, కోస్టారికా, జెర్మనీ, జపాన్
గ్రూప్ ఎఫ్: బెల్జీయం, కెనడా, మొరాకో, క్రొయేసియా
గ్రూప్ జీ: బ్రెజిల్, సెర్బీయా, స్విట్జర్లాండ్, కెమరూన్
గ్రూప్ హెచ్: పోర్చుగల్, గానా, ఉరుగ్వే, సౌత్ కొరియా

డిసెంబర్‌లో నాకౌట్..
డిసెంబర్ 3 మొదటి నాకౌట్ రౌండ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 9న క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 13న సెమీఫైనల్స్ జరగనున్నాయి. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు డిసెంబర్ 17న ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 18(ఖతర్ నేషనల్ డే)న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఖతర్‌లోని దోహా నగరానికి 15 కి.మీ దూరంలో ఉన్న లూసెయిల్ ఐకానిక్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఏ చానెల్‌లో వస్తుందంటే..?
ఫిఫా ప్రపంచకప్‌ను భారత్‌లో స్పోర్ట్స్ 18 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మాత్రం జియో సినిమా యాప్. ఈ యాప్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ యాప్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు చూడవచ్చు. జియో సినిమా యాప్‌కు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మళయాళంతో పాటు బెంగాళీ భాషల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కామెంట్రీ వినవచ్చు. అయితే తెలుగు భాషలో మాత్రం అందుబాటులో లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications