Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు: ఇలా వీక్షిస్తోన్న సాకర్ అభిమానులు

How are fans managing 2 World Cup games on at the same time

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో టాప్ జట్లకు గట్టి పోటీనిస్తూ చిన్న జట్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. ఉదాహరణకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీకి మెక్సికో దిమ్మతిరిగే షాకిచ్చింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఇక, పసికూన ఐస్‌లాండ్‌ మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాను డ్రాతో నిలువరించగా.. ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్‌ కూడా ఆరంభ మ్యాచ్‌ను డ్రాతోనే సరిపెట్టుకుంది. ఇలా, రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో పలు సంచలనాలు నమోదయ్యాయి.

టోర్నీలో భాగంగా ఎనిమిది గ్రూప్‌లకు చెందిన 32 జట్లు ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఈ క్రమంలో పలు జట్లు నాకౌట్‌కు అర్హత సాధించగా... మిగిలిన జట్లు నాకౌట్‌కు చేరతాయో లేదన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. గతవారం వరకు రోజుకు మూడు మ్యాచ్‌లు వివిధ టైమింగ్స్‌లో ఉండటంతో అన్ని మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం ఉంది.

అయితే, సోమవారం నుంచి రోజుకు నాలుగు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో షెడ్యూల్‌ ప్రకారం మొదటి రెండు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు, మిగతా రెండు మ్యాచ్‌లు రాత్రి 11.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లుండటంతో అభిమానులు ఒక్క మ్యాచ్‌నే వీక్షించాల్సి వస్తోంది.

అయితే, ఈ సమస్యను గుర్తించిన కొందరు సాకర్ అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. రెండు మ్యాచ్‌లను మిస్‌ కాకుండా ఉండాలంటే ఒక మ్యాచ్‌ను ల్యాప్‌టాప్‌లో, మరో మ్యాచ్‌ను టెలివిజన్‌లో చూడండి అంటూ ట్విటర్‌లో ఫొటోలను పంచుకుని సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Story first published: Wednesday, June 27, 2018, 11:59 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+