Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్టకముందే మరణించిన బిడ్డ.. గోల్ కొట్టి మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చిన స్టార్ ప్లేయర్!

మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనను మాత్రమే చూస్తాం. కానీ గుండెలు పగిలే బాధను పంటి బిగువన అదిమి పెట్టి దేశం కోసం ఆడే ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హక్పో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. లోకం చూడకుండానే బిడ్డ మరణించినా.. పుట్టెడు దు:ఖంలో ఫిఫా ప్రపంచకప్ ఆడి గోల్ నమోదు చేశాడు.

గోల్ పూర్తి చేసిన హక్పో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మోకాళ్లపై వంగి కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లంతా అతన్ని చుట్టుముట్టి ఓదార్చారు. అతడికి అండగా నిలిచారు.

ఎవరీ బ్యూటీఫుల్ ట్విన్ సిస్టర్స్? ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రేజీ సీన్! (వీడియో)

ఎవరీ బ్యూటీఫుల్ ట్విన్ సిస్టర్స్? ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రేజీ సీన్! (వీడియో)

నెదర్లాండ్స్ ఓటమి..

ఫిఫా ప్రపంచకప్‌ 2026‌లో భాగంగా మంగళవారం ఉదయం నెదర్లాండ్స్, మొరాకో మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో క్వార్టర్స్ చేరగా.. నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Heartbreaking Moments at FIFA World Cup 2026 Cody Gakpo In Tears After Scoring Days After Tragically Losing His Unborn Son

ఈ మ్యాచ్‌లో తొలి 70 నిమిషాల పాటు మొరాకో ఆధిపత్యం చలాయించింది. 72వ నిమిషంలో కూడీ హాక్పో ఎలాంటి తప్పిదం చేయకుండా గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. సాధారణంగా ఇలాంటి గోల్‌ చేసినప్పుడు స్ట్రైకర్‌తో పాటు జట్టు సభ్యులంతా సంబరాల్లో మునిగితేలుతారు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి దృశ్యాలు కనిపించలేదు. అందుకు భిన్నంగా నిశ్శబ్దం ఆవరించింది. హాక్పో కన్నీటి పర్యంతమవ్వగా.. ఆటగాళ్లు అతన్ని ఓదార్చారు. డచ్ ఆటగాళ్ల ప్రవర్తనను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సెలవిచ్చినా..

ఈ మ్యాచ్‌కు సరిగ్గా మూడు రోజుల ముందే హాక్పో బిడ్డను మరణించింది. హాక్పోతో రిలేషన్‌షిప్‌లో ఉన్న నోవా వాన్‌ డెర్‌ బిజ్‌ గత శనివారం ఈ విషాదకర విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఈ భూమి మీదకు రాకుండానే తమ బిడ్డ తమకు దూరమైందని పేర్కొంది. కూడీ హాక్పో, అతని భాగస్వామి నోవా 2025లో తొలి బిడ్డకు జన్మనిచ్చారు.

గట్టెక్కిన బ్రెజిల్.. ముచ్చెమటలు పట్టించిన జపాన్

గట్టెక్కిన బ్రెజిల్.. ముచ్చెమటలు పట్టించిన జపాన్

ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నీకి కొన్ని వారాల ముందు తమకు రెండో బిడ్డ పుట్టబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. దురదృష్టవశాత్తూ వారు ఈ బిడ్డను కోల్పోయారు. ఈ విషాద సమయంలో హాక్పో తన కుటుంబంతో ఉండేందుకు వీలుగా నెదర్లాండ్స్‌ మేనేజ్మెంట్ అతనికి సెలవులు ఇచ్చింది. కానీ టోర్నీలో అత్యంత కీలకమైన నాకౌట్‌ దశ జరుగుతున్న వేళ.. జట్టును వీడేందుకు అతను అంగీకరించలేదు. మరణించిన బిడ్డను చూడకుండా.. మనసులోనే బాధను దాచుకొని మ్యాచ్ ఆడాడు. అయితే అతని పోరాటం వృథా అయ్యింది.

Story first published: Tuesday, June 30, 2026, 18:10 [IST]
Other articles published on Jun 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+