Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నార్వే సంచలన విజయం.. బ్రెజిల్ ఔట్! వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మార్!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ పోరాటం ముగిసింది. సోమవారం తెల్లవారజామున జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో నార్వే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. బ్రెజిల్ ఇంటిబాట పట్టింది. దాంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ప్రపంచకప్ ప్రస్థానం విషాదాంతమైంది. ఈ ఓటమితో నెయ్‌మార్ వెక్కి వెక్కి ఏడ్చాడు.

IND vs ENG: రవి బిష్ణోయ్ ఔట్?.. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: రవి బిష్ణోయ్ ఔట్?.. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

హాలాండ్ విశ్వరూపం..

మ్యాచ్‌ ఆసాంతం నార్వె ప్లేయర్ హాలాండ్ అద్భుత ప్రదర్శన కొనసాగించాడు. 79వ నిమిషంలో ఆండ్రియాస్ అందించిన పాస్‌ను హాలాండ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి నార్వేకు 1-0తో తొలి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 90వ నిమిషంలో బాక్స్ బయట నుంచి శక్తివంతమైన లెఫ్ట్-ఫుట్ షాట్‌తో బ్రెజిల్ కీపర్ అలిసన్‌ను దాటించి రెండో గోల్ కొట్టాడు. దాంతో నార్వే విజయం ఖాయమైంది. నెయ్‌మార్ ఇంజూరీ టైమ్ (100వ నిమిషం)లో లభించిన పెనాల్టీని గోల్‌గా మార్చినప్పటికీ..అప్పటికే బ్రెజిల్ ఓటమి ఖాయమైంది.

Erling Haaland Brace Sinks Brazil as Norway March into FIFA World Cup 2026 Quarter-Finals

బ్రెజిల్‌ను ముంచిన పెనాల్టీ మిస్..

ఫస్టాఫ్‌లో బ్రెజిల్‌కు లభించిన సువర్ణావకాశాన్ని బ్రూనో గిమారెస్ వృథా చేశాడు. అతను కొట్టిన పెనాల్టీని నార్వే కీపర్ ఆరియన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. 1986 తర్వాత ప్రపంచకప్‌లో బ్రెజిల్ ఆటగాడు పెనాల్టీని మిస్ చేయడం ఇదే తొలిసారి. నార్వే కీపర్ నైలాండ్ కూడా వినీషియస్, మార్టినెల్లి షాట్లను అడ్డుకుంటూ గోడలా నిలిచాడు. జూలై 11న జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ లేదా మెక్సికోతో నార్వే తలపడనుంది.

చారిత్రక రికార్డులు..

నార్వే ప్లేయర్ హాలాండ్ వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గోల్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ 14 మ్యాచ్‌ల్లో మొత్తం 27 గోల్స్ చేశాడు. క్రిస్టియన్ వియేరి (1998) తర్వాత తన తొలి నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ గోల్స్ చేసిన ఎనిమిదో యూరోపియన్ ఆటగాడిగా హాలాండ్ నిలిచాడు.

ప్రపంచకప్‌లో వయాగ్రా వాడనున్న ఇంగ్లండ్ ప్లేయర్లు

ప్రపంచకప్‌లో వయాగ్రా వాడనున్న ఇంగ్లండ్ ప్లేయర్లు

2014లో జర్మనీ ఆటగాళ్ల తర్వాత ప్రపంచకప్‌లో బ్రెజిల్‌పై ఒకే మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఘనత కూడా హాలాండ్‌కు దక్కింది. 2002 ఫైనల్ తర్వాత ప్రపంచకప్ నాకౌట్ దశలో యూరోపియన్ జట్లపై బ్రెజిల్ ఓడిపోవడం ఇది వరుసగా ఏడోసారి.

Story first published: Monday, July 6, 2026, 9:33 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+