Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విధి రాసిన వింత కథ.. నాడు మెస్సీ చేతిలో పసికందు.. నేడు ప్రత్యర్థి!

అది 2007 డిసెంబర్. అప్పుడే ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఓ కుర్రాడు ఓ ఛారిటీ ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా నెలల వయసున్న పసికందును ఎత్తుకున్నాడు. బాత్ టబ్‌లో స్నానం కూడా చేయించాడు. వణుకుతున్న చేతులతోనే ఆ కుర్రాడు ఈ పనులు చేశాడు. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడు వరల్డ్ బెస్ట్ ఫుట్‌బాలర్‌గా.. కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవంగా ఎదిగాడు. ఆ పసికందు కూడా ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.

కాకతాళీయమో ఏమో కానీ ఈ ఇద్దరూ ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో ప్రత్యర్థుల్లా తలపడబోతున్నారు. టాలీవుడ్ సినిమాను తలపిస్తున్న ఈ కథలో ఆ కుర్రాడు ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ అయితే.. ఆ పసికందు 19 ఏళ్ల స్పెయిన్ యువ ప్లేయర్ లామిన్ యామల్.!

FIFA World Cupలో రచ్చ: ఓటమి భారంతో అర్జెంటీనా ఆటగాడిపై ఇంగ్లాండ్ స్టార్ దాడి! (వీడియో)

FIFA World Cupలో రచ్చ: ఓటమి భారంతో అర్జెంటీనా ఆటగాడిపై ఇంగ్లాండ్ స్టార్ దాడి! (వీడియో)

సినిమాను మించిన ట్విస్టులు..

ఈ ఇద్దరూ ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో అద్వితీయ‌మైన ప్రదర్శనతో తమ జట్లను ఫైనల్‌కు చేర్చారు. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది మూడో సారి కాగా.. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే స్పెయిన్ రెండో సారి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది.

From Baby Picture to FIFA World Cup 2026 Final Lionel Messi and Lamine Yamal s Incredible Football Journey

ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో మెస్సీ, లామిన్ యామల్ కథను వరల్డ్ మీడియా రక్తికట్టిస్తోంది. ఈ ఇద్దరి ఫుట్‌బాల్ ప్రయాణం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 19 ఏళ్ల క్రితం మెస్సీ ఎత్తుకున్న కుర్రాడు.. ఇప్పుడు అతనికి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నాడనే విషయం క్రీడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కథను తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.

ఓ ఛారిటీ ఫొటో షూట్‌లో..

2007లో 20 ఏళ్ల మెస్సీ.. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్‌లో భాగంగా ఓ పసికందును మెస్సీ వణుకుతున్న తన చేతులతో ఎత్తుకున్నాడు. అంతేకాకుండా బాత్ టబ్‌లో స్నానం కూడా చేయించాడు. 19 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడే, స్పెయిన్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఫిఫా ప్రపంచకప్ ఆడటంతో పాటు ఫైనల్ చేరి మెస్సికి ప్రత్యర్థిగా నిలిచాడు. దాంతో ఈ వార్త క్రీడా వర్గాల్లో క్రేజీ‌గా మారింది. సినిమాల్లో కూడా ఇలాంటి ట్విస్టులు ఉండవని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

ఆసక్తికరమైన ప్రయాణం..

ఆ సమయంలో బార్సిలోనా క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ.. వరల్డ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదుగుతాడని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అలాగే మెస్సీ చేతిలో ఉన్న ఆ పసి కందు.. ఫుట్‌బాల్ ప్లేయర్ అవుతాడని, ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకే ప్రత్యర్థిగా నిలుస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ కాలం ఓ ఫొటో షూట్‌లో కలిపిన ఈ ఇద్దర్నీ 19 ఏళ్ల తర్వాత విశ్వవేదికపై ప్రత్యర్థుల్లా నిలబెట్టింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథ లియోనల్ మెస్సీకి తెలియదంటా. విచిత్రకరమైన అంశం ఏంటంటే ఈ తరం ఆటగాళ్లలో తనకు నచ్చే ఆటగాడు లామిన్ యమల్ అని మెస్సీ పేర్కొనడం గమనార్హం. అతని ఆట తనను తలపిస్తుందని, చిన్నతనంలో తాను ఎలా ఆడేవాడినో.. లామిన్ కూడా అలానే ఆడుతున్నాడని మెస్సీ కితాబిచ్చాడు.

మెస్సీ తన ఆరాధ్య దైవమని చెప్పిన లామిన్ యామల్ అతనితో తనను పోల్చవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ గెలుస్తాడా? లేక 19 ఏళ్ల లామిన్ యామల్ విజయాన్ని అందుకుంటాడా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Story first published: Thursday, July 16, 2026, 17:05 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+