For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నేహితులు ప్రత్యర్ధుల్లా మారిన వేళ: విజయం ఎవరిని వరిస్తుందో?

By Nageshwara Rao
Friends turn rivals when Atletico Madrid teammates Griezmann and Godin face off in France vs Uruguay

హైదరాబాద్: వారిద్దరూ స్నేహితులు. ఎక్కువగా కలిసే ఉంటారు. కలిసి ఒకే జట్టు తరపున ఫుట్‌బాల్‌ ఆడతారు. కానీ, ఇప్పుడు మాత్రం వారిద్దరూ త్యర్థులుగా బరిలో దిగబోతున్నారు. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో తమ దేశాలను సెమీస్‌కు చేర్చడం కోసం ఒకర్నొకరు ఢీ కొట్టబోతున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఆ ఇద్దరూ ఎవరో కాదు.... ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోయిన్‌ గ్రీజ్‌మన్‌, ఉరుగ్వేకు చెందిన డీగో గోడిన్‌. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.

క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఉరుగ్వే-ఫ్రాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. లాలిగా టోర్నీలో వీరిద్దరూ అట్లెటికో మాడ్రిడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఒకే జట్టు తరుపున ఆడుతుండటంతో గ్రీజ్‌మన్‌, గోడిన్‌లు మంచి స్నేహితులుగా మారారు.

గత నాలుగేళ్లుగా లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతుండటంతో వీరిద్దరి మధ్య స్నేహాం మరింతగా బలపడింది. ఎంతలా అంటే గ్రీజ్‌మన్‌ కూతురు మియాకు గోడిన్‌ గాడ్‌ఫాదర్‌‌లో వ్యవహారించేంతలా. ఉరుగ్వే వంటకాలంటే గ్రీజ్‌మన్‌ ఎంతో ఇష్టం. ఉరుగ్వేలో ఎప్పుడు పర్యటించినా.. గోడిన్‌ పక్కన ఉండాల్సిందే.

అలాంటి గ్రీజ్‌మన్‌కు ఫ్రాన్స్ మ్యాచ్‌ ఓ కఠిన పరీక్ష లాంటిదే. ఫ్రాన్స్-ఉరుగ్వే మ్యాచ్‌పై గ్రీజ్‌మన్‌ మాట్లాడుతూ ''గోడిన్‌ ఓ గొప్ప స్నేహితుడు. మాడ్రిడ్‌లో ప్రతిరోజు నేను అతనితోనే ఉన్నా. నేను ప్రేమించే దేశం, ప్రజలకు పోటీగా బరిలో దిగబోతున్నా. ఇది నా భావోద్వేగాలకు సంబంధించిన మ్యాచ్‌'' అని అన్నాడు.

మరోవైపు గోడిన్ మాట్లాడుతూ ''గ్రీజ్‌మన్‌ ఉరుగ్వేకు చెందిన వాడిని అని చెప్పుకుంటాడు. అతని చుట్టూ ఎప్పుడూ ఉరుగ్వే ఆటగాళ్లే ఉంటారు. అతనికి మా ఆచారవ్యవహారాలు, ఆహారం, సంగీతం అంటే అమితమైన ఇష్టం'' అని అన్నాడు. స్నేహితులు తలపడబోతున్న మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Story first published: Friday, July 6, 2018, 16:06 [IST]
Other articles published on Jul 6, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+