Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్ పైనల్లో గ్రీజ్‌మన్ 'టేక్ ద ఎల్' డ్యాన్స్: వీడియా వైరల్

French player does Fortnite’s ‘Take the L’ dance after World Cup goal

హైదరాబాద్: రష్యాలోని మాస్కో వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియాను 4-2తేడాతో ఓడించి ఫ్రాన్స్ 2018 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గోల్... రెండో గోల్. ఈ గోల్ మ్యాచ్ రిఫరీ తీసుకున్న 'వీఏఆర్‌' నిర్ణయం ద్వారా పెనాల్టీ రూపంలో వచ్చింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

గ్రీజ్‌మన్‌ గోల్‌ పోస్ట్‌ వైపు కిక్‌ కొట్టగా.. మటౌడి హెడర్‌ కోసం ప్రయత్నించినప్పటికీ, దానిని ప్రత్యర్ధి గోల్ పోస్టులోకి కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో బంతి పెరిసిచ్‌ చేతికి తగిలింది. అయితే పెరిసిచ్ చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. తొలుత పెనాల్టీకి అంగీకరించని రిఫరీ 'వీఏఆర్‌' ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది.

పెరిసిచ్‌ చేతికి బంతి తగలడం వాస్తవమే అయినప్పటికీ, అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా ఆటగాళ్ల వాదన చెల్లలేదు. ఈ పెనాల్టీ గోల్‌‌ కొట్టే అవకాశాన్ని ఫ్రాన్స్ జట్టు నుంచి గ్రీజ్‌మన్ దక్కించుకున్నాడు. 38వ నిమిషంలో గ్రీజ్‌మన్.. తన ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేసి అలవోకగా గోల్‌ కొట్టాడు. దీంతో ఫ్రాన్స్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

గోల్ కొట్టిన అనంతరం గ్రీజ్‌మన్ మైదానంలోనే చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ వీడియో గేమ్ అయిన 'టేక్ ద ఎల్' ఈమోట్‌లోని డ్యాన్స్‌ను గ్రీజ్‌మన్ మైదానంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న 'వీఏఆర్‌' నిర్ణయంపై క్రొయేషియా కోచ్, పుట్‌బాల్ విశ్లేషకులు మండిపడుతున్నారు. క్రొయేషియా కోచ్ జ్లాట్కో దలిక్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "రిఫరీ నిర్ణయంపై మాట్లాడకూడదు. అయితే, వరల్డ్‌కప్ లాంటి మ్యాచ్‌ల్లో ఇలాంటి వాటికి రిఫరీ పెనాల్టీని ఇవ్వకూడదు" అని అన్నాడు.

Story first published: Monday, July 16, 2018, 19:01 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+