ప్రశంసల వర్షం: అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా ఫ్రాన్స్ కోచ్ అరుదైన ఘనత

హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ నిరీక్షణ ఫలించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు వరల్డ్‌కప్ 2018 టైటిల్ విజేతగా నిలిచింది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో 20 ఏళ్ల తర్వాత ప్రాన్స్ రెండోసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
1998లో స్వదేశంలో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలిచింది. దీంతో ప్రాన్స్‌లో అంబరాలు సంబరాన్నంటాయి. అయితే, ఈ సంబరాలు వెనుక ఉన్న ఆ జట్టు కోచ్ దిదియర్ డెచాంప్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజానికి పుట్‌బాల్‌లో జట్ల ప్రదర్శన కంటే కోచ్/మేనేజర్ ప్రాత ఎంతో ప్రత్యేకం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రష్యా వేదికగా జరిగిన 21వ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ కప్పు గెలవడంలోనూ కోచ్ దిదియర్ డెచాంప్స్ పాత్ర ఎంతో కీలకం. 2006లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్.. తర్వాతి వరల్డ్‌కప్‌కు వచ్చేసరికి గ్రూప్ స్టేజిని కూడా దాటలేకపోయింది. అందుకు కారణం జిదానె లాంటి స్టార్ల ప్లేయర్లు ఫ్రాన్స్ నుంచి నిష్క్రమంచడమే. దీంతో ఆ జట్టు బలహీనపడింది.
1998లో కెప్టెన్‌గా ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపిన డెచాంప్స్ 2010లో రెండేళ్లకు ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎలా సన్నద్ధం చేయాలో అతడికి బాగా తెలుసు. అందుకు కారణం ఇప్పటికే ఇటలీకి చెందిన ప్రముఖ క్లబ్ యువెంటస్‌కు అతడు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉండటమే.

యువకులకు కఠిన శిక్షణ
జట్టులోకి ప్రతిభావంతులైన కుర్రాళ్లను తీసుకుని వారికి కఠిన శిక్షణ ఇచ్చాడు. గ్రీజ్‌మన్, పోగ్బా లాంటి కుర్రాళ్లు మేటి ఆటగాళ్లుగా ఎదిగింది ఇతడి హయాంలోనే. రష్యా వరల్డ్ కప్‌లో ఉత్తమ యువ ప్లేయర్‌కు ఇచ్చే అవార్డును సొంతం చేసుకున్న ఎంబాపే ప్రతిభను కూడా గుర్తించాడు. అంతేకాదు ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని పెంపొందించాడు.

రెండేళ్లకే సత్తా చాటిన ఫ్రాన్స్
దిదియర్ డెచాంప్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లకే ఫ్రాన్స్ 2014 వరల్డ్ కప్‌లో సత్తా చాటింది. 2014 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ క్వార్టర్స్ చేరింది. బ్రెజిల్ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జర్మనీకి గట్టి పోటీ ఇచ్చి 0-1తో ఓడింది. అనంతరం రెండేళ్ల తర్వాత అద్భుత ప్రదర్శనతో యూరో ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

పోర్చుగల్ చేతిలో ఓటమి
అయితే, పైనల్లో పోర్చుగల్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత జట్టును వరల్డ్‌కప్‌కు సన్నద్ధం చేశాడు. చాలా జట్లు ఎటాకింగ్‌లో ఉన్నంత బలంగా డిఫెన్స్‌లో ఉండవు. కానీ, ఫ్రాన్స్ మాత్రం అందుకు భిన్నం. బెల్జియంతో సెమీఫైనల్లో ప్రత్యర్థి ఆటగాళ్లు ఎన్ని దాడులు చేసినా ఫ్రాన్స్ ఆ దాడి నుంచి ఎలా తప్పించుకుందో మనకు తెలిసిందే.

వ్యూహాలు పన్నడంలో దిదియర్ దిట్ట
వ్యూహాలు పన్నడంలో.. మైదానంలో అప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో దిదియర్ డెచాంప్స్. ఫైనల్లో క్రొయేషియా ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్న క్రమంలో సరైన వ్యూహాలు అమలు చేసి ఫ్రాన్స్‌కు రెండోసారి వరల్డ్ కప్‌ను అందించాడు. దీంతో కెప్టెన్‌గా, కోచ్‌గా కప్పు అందుకున్న మూడో వ్యక్తిగా డెషాంప్స్ అరుదైన ఘనత సాధించాడు.

మూడో వ్యక్తిగా డెషాంప్స్ అరుదైన ఘనత
జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్ కప్ సాధించారు. 2002 నుంచి నాలుగు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్ నమోదయ్యాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. 1998 డెషాంప్స్ నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications