Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం గోల్ కొట్టాడు..: పెద్దాయన వీడియో పోస్టు చేసిన సెహ్వాగ్, ట్వీట్ వైరల్

Forget France , England, Croatia, here is the man the legend

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. దీంతో కొద్దిసేపు ఆ టోర్నీని మరిచిపొమ్మంటున్నాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ప్రస్తుత మాజీ క్రికెటర్ల పుట్టినరోజు నాడు తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరించడంతో పాటు... తనకు నచ్చిన విషయాలపై కూడా అప్పుడప్పుడు సెటైరిక్‌ ట్వీట్స్‌ చేస్తుంటాడు. తాజాగా అలాంటి ట్వీట్ సెహ్వాగ్ అభిమానులను కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం మొత్తం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మునిగితేలుతుంటే... అందుకు సంబంధించిన వీడియోని సెహ్వాగ్ తన ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు. "ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, ‍క్రొయేషియాలను మరిచిపోండి.. ఇతన్ని చూడండి" అంటూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఓ ముసలాయన కొట్టిన గోల్‌. అతడు ఫుట్‌బాల్‌ మైదానంలో ఆ గోల్‌ సాధించలేదు. రోడ్డుపై నుంచి బంతిని నేరుగా ఓ ఇంటి కిటికీలో పంపించాడు. ఈ వీడియోని వీక్షించిన వారంతా 'వారెవ్వా ఏం గోల్' అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రస్తుతం రష్యా వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా మంగళవారం బెల్జియంతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌ 1-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్-క్రొయేషియా జట్ల మధ్య జరగనుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి మాస్కోలోని లుజ్నికి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం (జులై 15) రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, July 11, 2018, 12:16 [IST]
Other articles published on Jul 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+