Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం ఫుట్‌బాలర్.. స్వదేశం వెళ్లలేక ఎయిర్​పోర్ట్ పక్కనే 74 రోజులు నివాసం

Footballer stuck at Mumbai airport for 74 days

ముంబై: ఓవైపు అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం.. మరోవైపు లాక్‌‌డౌన్.. ఈ రెండింటినీ మించి ముంబైలో విపరీతంగా పెరుగుతున్న కరోనా.. ఈ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన ఘనా ఫుట్‌‌బాల్‌‌ ప్లేయర్ రాండీ హవాన్ ముల్లర్.. తన జీవితాన్ని కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేశాడు. ముంబై ఎయిర్‌‌ పోర్ట్‌‌ టెర్మినల్ పక్కన 73 రోజుల పాటు ఒంటరి జీవితాన్ని గడిపాడు.

 మార్చి మధ్యలో వచ్చి..

మార్చి మధ్యలో వచ్చి..

చేతిలో ఉన్న వెయ్యి రూపాయలతో కాలం వెళ్లదీశాడు. కేరళ పాపులర్ సెవెన్ ఏ సైడ్ టోర్నీ కోసం 24 ఏళ్ల ముల్లర్.. మార్చి మధ్యలో భారత్‌కు వచ్చాడు. కానీ అప్పటికే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుండటంతో.. స్వదేశానికి వెళ్లేందుకు త్రిస్సూర్ నుంచి ముంబైకి రైల్లో బయలుదేరాడు. కానీ హోటల్​ నుంచి ఎయిర్‌‌పోర్ట్‌‌కు చేరుకున్నాక అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారని తెలిసింది.

 పోలీసుల సాయంతో..

పోలీసుల సాయంతో..

‘ఫ్లైట్స్ బంద్ కావడంతో అక్కడే నిద్రపోయా. ఓ పోలీసు వచ్చి లేపాడు. అక్కడి నుంచి వెళ్లాలని చెప్పాడు. కానీ నేను కేరళ తిరిగి వెళ్లలేను. అలాగని హోటల్‌‌లో ఉండలేను. ఎందుకంటే డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియలేదు. నాకు చావు తప్పదని భావించా. చివరకు ఎవరూ చూడని ఓ టెర్మినల్ దగ్గర చిన్న ప్లేస్​లో ఉండిపోయా. పోలీసులు ఆ ప్లేస్‌‌ను అంత సులువుగా గుర్తించలేరు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు కనిపెట్టినా.. నా పరిస్థితిని చూసి సాయం చేశారు. అలా అక్కడే రెండున్నర నెలలు ఉన్నా. పోలీసులు ఇచ్చే ఫుడ్ తినడం, వాళ్ల మొబైల్స్‌‌లో హిందీ సినిమాలు చూస్తూ గడిపా. మా ఊరు విషయాలను వాళ్లకు చెప్పా' అని ముల్లర్ పేర్కొన్నాడు.

ఆదుకున్న మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే..

ఆదుకున్న మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే..

నిసర్గ తుపాన్ వచ్చినప్పుడు పోలీసులు తమ క్యాబిన్‌‌ను ఇచ్చి ఆదుకున్నారన్నాడు. అయితే రెండు రోజుల కిందట మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేకు ఈ విషయం తెలిసి ఆదుకున్నారని చెప్పాడు. హోటల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎంబసీతో మాట్లాడించారని అన్నాడు. వీలైనంత త్వరగా ఘనాకు వెళ్లే ఫ్లైట్‌‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నానని ముల్లర్ వెల్లడించాడు.

చనిపోయానని అనుకున్నారు..

చనిపోయానని అనుకున్నారు..

తన ఫోన్ చెడిపోవడంతో 20 రోజుల పాటు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదని ముల్లర్ చెప్పాడు. దీంతో తాను చనిపోయినట్లు భావించారన్నాడు. ‘పోలీసులే నాకు ఓ ఫోన్ ఇచ్చారు. నా కుటుంబానికి నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను చనిపోయానేమోనని అనుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు నేను భద్రంగా ఉన్నా. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. నా కోసం రోటీ, బిస్కట్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చేవారు. కాకపోతే బట్టల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒకే జతను వారం రోజులు వేసేవాడిని. తర్వాత ఎండలో ఆరబెట్టి, కొద్దిగా ఫెర్ఫ్యూమ్ కొట్టి మళ్లీ వేసుకునేవాడిని' అని ముల్లర్ వివరించాడు.

Story first published: Tuesday, June 9, 2020, 14:53 [IST]
Other articles published on Jun 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+