Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం పీలే!

Football legend Pele recovering satisfactorily after surgery to remove a tumor from his colon

న్యూఢిల్లీ: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగులోని కణితిని సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు.. అనంతరం ఆయనను ఇంటెన్సివ్‌ కేర్‌ (ఐసీయూ)లో ఉంచారు. ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ బాగానే పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక 'రోజురోజుకి నా ఆరోగ్యం మరింత మెరుగుపడుతోంది' అని పీలే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేయారు.

రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆగస్టులో పీలే ఆసుపత్రికి వెళ్లగా.. అతని పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ ద్వారా తొలగించారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరిటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మూడు ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా పీలే రికార్డు సృష్టించారు. 1958, 1962, 1970ల్లో మూడు సార్లు పీలే బ్రెజిల్‌ను 'ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌'గా నిలిపారు. బ్రెజిల్‌ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉండటం విశేషం.

ఇక 2012లో పీలేకు చేసిన హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విఫలమవడంతో అతను కొన్నాళ్లపాటు వీల్‌చైర్‌కు పరిమితమయ్యాడు. ఆ తర్వాత కిడ్రీ సంబంధిత వ్యాధులతో కూడా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఒక క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా పీలే పేరిటనే ఉండగా గతేడాది.. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్‌ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్‌ చేశాడు.

దీంతో అతను ప్రపంచంలోనే అతిగొప్ప సాకర్‌ ఆటగాడిగా నిలిచాడు. గతేడాది లియనెల్‌ మెస్సీ బార్సీలోనా జట్టు తరఫున అతని రికార్డును బ్రేక్ చేశాడు. 2004 నుంచి మొత్తం 17 సీజన్ల పాటు బార్సిలోనా టీమ్‌కు ఆడిన మెస్సీ.. 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలేను అధిగమించాడు.

Story first published: Sunday, September 12, 2021, 11:39 [IST]
Other articles published on Sep 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+