Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: రష్యా వీధుల్లో సంబరాలు, ఇది ఆరంభం మాత్రమే

FIFA World Cup: This is just the beginning, says Russia coach

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఆతిథ్య రష్యా ఘనంగా బోణి చేసింది. సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య గురువారం జరిగన ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై 5-0తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఎనిమిది నెలల తర్వాత రష్యా తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసింది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

రష్యా కొట్టిన ప్రతి గోల్‌ను అక్కడి సాకర్ అభిమానులు ఆస్వాదించారు. అందేకాదు రష్యా వీధుల్లో అభిమానులు చిందులేశారు. ఈ సందర్భంలో ఆ దేశ మీడియా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరంభ మ్యాచ్‌లో రష్యా శుభారంభం చేయడంతో అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోయింది.

రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లైవ్‌ను మాస్కో స్టేడియం పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రదర్శించడంతో అభిమానుల తమ ఫేవరెట్‌ జట్ల జెండాలను పట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ గెలుపు ఆరంభం మాత్రమేనని ఆ జట్టు కోచ్ స్టానిస్లేవ్ చెర్చెసోవ్ అన్నాడు.

ఈ సందర్భంగా రష్యా జట్టు కోచ్ స్టానిస్లేవ్ చెర్చెసోవ్ మాట్లాడుతూ "గొప్పగా పోరాడి విజయం సాధించిన జట్టుతో నా అభినందనలు పంచుకోవాలని ఆయన(అధ్యక్షుడు) నన్ను కోరారు. ఇలాంటి ప్రదర్శననే మున్ముందు కొనసాగించాలని తనకు తెలిపారు" అని అన్నాడు.

FIFA World Cup: This is just the beginning, says Russia coach

టోర్నీలో రష్యా సాధించిన తొలి విజయాన్ని మీతో పాటు మీ జట్టు క్రీడాకారులు ఎలా ఆస్వాదిస్తున్నారని అడిన ప్రశ్నకు "ఇది ఆరంభం మాత్రమే" అని చెర్చెసోవ్ బదులిచ్చాడు. కాగా, రష్యా అద్భుత విజయం వెనక ఉన్న జట్టు కోచ్‌ను ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అభినందించారు. పుతిన్ ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు.

టోర్నీలో రష్యా తన తదుపరి మ్యాచ్‌లో వచ్చే శుక్రవారం ఈజిప్ట్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో చెర్చెసోవ్ మాట్లాడుతూ "ఈజిప్టు స్టార్ ఫార్వర్డ్ మహ్మద్ సలా ఆడుతాడో లేదో మాకు ఏమాత్రం తెలియదు. అతడు టీమ్‌లో ఉన్నా, లేకున్నా ఆ టీమ్ మాత్రం సత్తా ఉన్న‌ జట్టే . ఒకవేళ అతడు టీమ్‌లో ఉంటే కొంచెం బలం పెరుగుతుంది. వాళ్లతో తదుపరి మ్యాచ్ మాకు చాలా క్లిష్టమైంది" అని చెప్పాడు.

దాదాపు 8దశాబ్దాల అనంతరం రష్యాకు దక్కిన అరుదైన విజయమిది. 1934లో ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన రష్యా.. తొలిరోజే ప్రత్యర్థిని మట్టికరిపించి బోణీ కొట్టింది. ఆరంభ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో పాటు పలువురు ప్రత్యక్షంగా వీక్షించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, June 15, 2018, 19:07 [IST]
Other articles published on Jun 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+