వరల్డ్ కప్‌లో మెస్సీ Vs రొనాల్డో: ఇద్దరిలో ఎవరు గొప్ప?


హైదరాబాద్: రష్యా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తోన్న 21వ ఫిఫా వరల్డ్ కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఫిఫా వరల్డ్ కప్ అనగానే అత్యుత్తమ పోరాటాలు గుర్తొస్తాయి. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారు.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్ల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేర్లు లియోనల్ మెస్సీ , క్రిస్టియానో రొనాల్డో, నేయమార్. వీరితో పాటు హ్యారీ కేన్ (ఇంగ్లాండ్), మహమ్మద్ సలా (ఈజిప్ట్), ఆంటోనీ గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్), కెవిన్ డి బ్రూన్ (బెల్జియం) తమ ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు.

ఆశలన్నీ వారిద్దరిపైనే
అయితే, వీరిలో అభిమానులు మాత్రం మెస్సీ, రొనాల్డోపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఎందుకంటే రష్యా ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్ వీరికి చివరి వరల్డ్‌కప్ కావచ్చని పుట్‌బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచ దృష్టి మొత్తం ఈ ఇద్దరు స్టార్లపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? అనే చర్చకు తెరదీసింది.

ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప?
నిజానికి ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఓటమి అంచున్న ఎన్నో మ్యాచ్‌లను వీరి ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం. ఇద్దరి మధ్య అంతటి పోటీ నెలకొంది. అంతేకాదు రష్యా వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో ఈ ఇద్దరూ గోల్డెన్‌బూట్ అవార్డు రేసులో కూడా ఉన్నారు.

గోల్డెన్‌బూట్ రేసులో కూడా
వరల్డ్ కప్‌లో గోల్స్ అత్యధికంగా ఎవరు చేస్తారో వారికే గోల్డెన్‌బూట్ బహూకరించే సంగతి తెలిసిందే. ఈసారి బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీలకే దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా బెల్జియం ఆటగాడు కెవిన్ డి బ్రూన్, ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ, జర్మనీ స్టార్ ముల్లర్ పేర్లు వినిపిస్తున్నాయి.

రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో
వయస్సు: 33
ప్రొఫెషనల్ సీజన్స్: 16
ఆడిన లీగ్ జట్లు: ఎస్పీ లిస్బ(31), మాంచెస్టర్ యునైటెడ్(292), రియల్ మాడ్రిడ్(438)
జాతీయ జట్టు: పోర్చుగల్ (150)
మొత్తం మ్యాచ్‌లు: (911)
మొత్తం గోల్స్: 654( జాతీయ జట్టుకు 81)

లియోనల్ మెస్సీ
వయస్సు: 30
ప్రొఫెషనల్ సీజన్స్: 14
ఆడిన లీగ్ జట్టు: ఎఫ్‌సీ బార్సిలోనా(637)
జాతీయ జట్టు: అర్జెంటీనా(124)
మొత్తం మ్యాచ్‌లు: 761
మొత్తం గోల్స్: 616
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications