
హైదరాబాద్: రష్యా వేదికగా మరికొన్ని గంటల్లో సాకర్ సంరంభం మొదలుకానుంది. ఇందుకు మాస్కో నగరం అందంగా ముస్తాబు అయింది. గురువారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో సాకర్ సంరంభం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది. ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్-ఎలో బరిలో నిలిచింది. జూన్ 28వ వరకు గ్రూప్ దశ పోటీలు ఉంటాయి.
ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు... మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు మాస్కోలోని లుజ్నినికి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎప్పట్లాగే ఈ సారి కూడా కొందరు స్టార్ ఆటగాళ్లపై అభిమానుల దృష్టి నిలిచింది. వారిలో ముందు వరుసలో కనిపించేది మెస్సీ, రొనాల్డో, నేమార్. వీరితో పాటు హ్యారీ కేన్ (ఇంగ్లండ్), మహమ్మద్ సలా (ఈజిప్ట్), ఆంటోనీ గ్రిజ్‌మన్ (ఫ్రాన్స్), కెవిన్ డి బ్రూన్ (బెల్జియం) తమ ఆటతో కనువిందు చేయనున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:
* ఇది 21వ వరల్డ్‌కప్. మొదటి టోర్నీ 88 ఏళ్ల కిందట ఉరుగ్వే (1930)లో జరిగింది. ఈ టోర్నీలో ఉరుగ్వేనే తొలి విజేతగా నిలిచింది.
* ఫిఫా వరల్డ్ కప్‌లో ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ మిరోస్లావ్ క్లోజ్. జర్మనీకి చెందిన ఈ స్ట్రయికర్ నాలుగు టోర్నీల్లో కలిపి 16 గోల్స్ కొట్టాడు.
* ఒక వరల్డ్ కప్‌లో నమోదైన అత్యధిక గోల్స్ 171. ఇవి 1988, 2014 టోర్నీలలో నమోదయ్యాయి. 2010లో అతి తక్కువగా 145 గోల్స్ నమోదయ్యాయి.
* ఇప్పటిదాకా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో యూరోపియన్ (11), దక్షిణ అమెరికా (9) దేశాలే విజేతలుగా నిలిచాయి.
* ఈ సాకర్ టోర్నీలో పాల్గొంటున్న చిన్న దేశం ఐస్‌లాండ్. ఆ దేశ జనాభా 3 లక్షల 34 వేలు మాత్రమే.
* వరల్డ్ కప్ ట్రోఫీని అత్యధికసార్లు గెలుచుకున్న దేశం బ్రెజిల్. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.
* రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్‌లో మెక్సికో ఈ టోర్నీకి అర్హత సాధించడం ఇది 16వ సారి. ఒక్కసారి కూడా కప్పు నెగ్గకుండా అత్యధిక సార్లు పోటీ పడ్డ జట్టు అదే.
వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ వివరాలు:
* చాంపియన్‌కు: రూ. 256 కోట్లు
* రన్నరప్‌కు : రూ. 188 కోట్లు
* మూడో స్థానానికి: రూ. 161 కోట్లు
* నాలుగో స్థానానికి: రూ. 148 కోట్లు
* క్వార్టర్స్‌లో ఓడిన జట్టుకు: రూ. 108 కోట్లు
* ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన జట్టుకు: రూ. 81 కోట్లు
* గ్రూప్ దశలో ఓడిన జట్టుకు: రూ. 54 కోట్లు
* మొత్తం ప్రైజ్‌మనీ: 2701 కోట్లు