Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ డ్రా ఇదే!

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ డ్రా విడుదలైంది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్యక్రమంలో 48 జట్ల డ్రాను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ మెగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌‌కు అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్నాయి. తాజా డ్రా ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గ్రూప్ జేలో ఉండగా.. ఆల్జీరియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.

నయా ఫార్మాట్..

48 జట్లు బరిలోకి దిగడంతో ఫార్మాట్‌ను కొద్దిగా మార్చారు. మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

FIFA World Cup Draw Argentina Meet Austria Spain Draw Uruguay Portugal Face Colombia Brazil Clash with Morocco

టాప్-2లో నిలిచిన 24 జట్లు.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో 8 జట్లు నాకౌట్ స్టేజ్ చేరుతాయి. ఈ నాకౌట్ స్టేజిలో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచకప్‌ను గెలిచే జట్టు (గ్రూప్ దశలో 3 + నాకౌట్ దశలో 5) 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో విజేతగా నిలిచే జట్లు 7 మ్యాచ్‌లు ఆడేవి. ఈసారి ఒకటి అదనం.

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ గ్రూప్ డ్రా

గ్రూప్ ఏ: మెక్సికో, సౌతాఫ్రికా, కొరియా రిపబ్లిక్, UEFA ప్లేఆఫ్ డీ విన్నర్

గ్రూప్ బీ: కెనడా, UEFA ప్లేఆఫ్ ఏ విన్నర్

గ్రూప్ సీ: బ్రెజిల్, మొరాకో, స్కాట్లాండ్, హైతీ.

గ్రూప్ డీ: అమెరికా, పెరుగ్వే, ఆస్ట్రేలియా, UEFA ప్లేఆఫ్ సీ విన్నర్

గ్రూప్ ఈ: జర్మనీ, కురాకో, ఈక్వెడార్, కోట్ డి ఐవోర్

గ్రూప్ ఎఫ్: నెదర్లాండ్స్, జపాన్, UEFA ప్లేఆఫ్ B విజేత, ట్యునీషియా

గ్రూప్ జీ: బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్

గ్రూప్ హెచ్: స్పెయిన్, కాబో వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వే

గ్రూప్ ఐ: ఫ్రాన్స్, సెనెగల్, FIFA ప్లేఆఫ్ 2 విజేత, నార్వే

గ్రూప్ జే: అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్

గ్రూప్ కే: పోర్చుగల్, FIFA ప్లేఆఫ్ 1 విజేత, కొలంబియా, ఉజ్బెకిస్తాన్

గ్రూప్ ఎల్: ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘనా, పనామా

Story first published: Saturday, December 6, 2025, 8:25 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+