అగ్రరాజ్యం అమెరికాకు ఘోర పరాభావం.. చిత్తుగా ఓడించిన బెల్జియం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య అమెరికా పోరాటం ముగిసింది. అద్వితీయమైన ప్రదర్శనతో అగ్రరాజ్యం ప్రపంచకప్ కలలను బెల్జియం చిదిమేసింది. మంగళవారం తెల్లవారు జామున సీటెల్ స్టేడియంలో జరిగిన ప్రీక్వార్టర్ పోరులో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను చిత్తు చేసింది.
బెల్జియం స్టార్ చార్లెస్ డి కెటెలెరే డబుల్ గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్‌తో చెలరేగి అమెరికా పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో బెల్జియం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. అమెరికా ఇంటిబాట పట్టింది.
బెల్జియం ఆధిపత్యం..
మ్యాచ్ మొదలైన 46 సెకన్లలోనే బెల్జియం అటాకింగ్ విరుచుకుపడింది. 9వ నిమిషంలోనే నికోలస్ రాస్కిన్ అందించిన లో-క్రాస్‌ను డి కెటెలెరే గోల్‌గా మలిచి బెల్జియంకు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. అయితే 30వ నిమిషంలో అమెరికా ప్లేయర్ మాలిక్ టిల్‌మన్ ఫ్రీ-కిక్ కొట్టగా.. అది బెల్జియం డిఫెండర్లకు తగిలి గోల్‌గా మారింది. దాంతో స్కోరు 1-1 తో సమమై అమెరికా అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
కానీ ఆ సంతోషం రెండు నిమిషాలు కూడా నిలవలేదు. 32వ నిమిషంలో ట్రోసార్డ్ అందించిన క్రాస్‌ను డి కెటెలెరే హెడర్ ద్వారా మళ్లీ గోల్ చేసి బెల్జియం ఆధిక్యాన్ని 2-1తో డబుల్ చేశాడు.

యూఎస్ఏ కీపర్ ఘోర తప్పిదం..
సెకండాఫ్‌లో అమెరికా గోల్‌కీపర్ మాట్ ఫ్రీజ్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్‌ను పూర్తిగా బెల్జియం వైపు తిప్పేసింది. కీపర్ ఫ్రీజ్ నుంచి బంతిని లాక్కున్న డి కెటెలెరే, దానిని హన్స్ వనాకెన్‌కు అందించాడు. ఖాళీ పోస్ట్‌ను చూసి వనాకెన్ దూరం నుంచి సులువుగా గోల్ చేయడంతో బెల్జియం 3-1 తో ముందంజ వేసింది.
చివరి నిమిషాల్లో అమెరికా ఆటగాళ్లు బాలోగన్, బెర్హాల్టర్ సులువైన అవకాశాలను వృధా చేశారు. ఇంజూరీ టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ రొమేలు లుకాకు మరో క్లినికల్ గోల్ కొట్టడంతో అమెరికా 4-1 తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో బెల్జియం తలపడనుంది.
డి కెటెలెరే రికార్డ్..
ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 3 గోల్స్‌లో (2 గోల్స్, 1 అసిస్ట్) నేరుగా భాగస్వామ్యం పంచుకున్న తొలి బెల్జియం ఆటగాడిగా చార్లెస్ డి కెటెలెరే రికార్డు సృష్టించాడు.
అమెరికా జట్టు ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ఇది ఏడోసారి కాగా.. అందులో 6 సార్లు (2010, 2014, 2022, 2026 లతో కలిపి వరుసగా 4 సార్లు) ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.
బెల్జియం ఈ మ్యాచ్‌లో 2.15 ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ నమోదు చేయగా.. అమెరికా కేవలం 0.67 తో చేతులెత్తేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

