FIFA World Cup 2026: నెయ్‌మార్ పునరాగమనం.. స్కాట్లాండ్‌పై బ్రెజిల్ ఘన విజయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో బ్రెజిల్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-సీలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మయామిలో గురువారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 3-0 తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. స్టార్ స్ట్రైకర్ వినీషియస్ జూనియర్ రెండు గోల్స్‌తో బ్రెజిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో గ్రూప్-సీ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన బ్రెజిల్.. మొరాకోను వెనక్కినెట్టింది. ఈ పరాజయంతో స్కాట్లాండ్ నాకౌట్ ఆశలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడ్డాయి.
తొలి అర్ధభాగంలోనే జోరు..
మ్యాచ్ ప్రారంభమైన 7వ నిమిషంలోనే స్కాట్లాండ్ డిఫెండర్ చేసిన తప్పును అనుకూలంగా మార్చుకున్న రాయన్ అందించిన పాస్‌ను వినీషియస్ గోల్‌గా మలిచి బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మరో గోల్ చేసినా విఏఆర్ (VAR) ఫౌల్‌గా ప్రకటించారు. ఫస్టాఫ్ అదనపు సమయంలో (45+3 నిమిషం) బ్రూనో గుమారెస్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను వినీషియస్ హెడర్ ద్వారా నెట్‌లోకి పంపి బ్రెజిల్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్ మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ చేసిన ఐదో బ్రెజిల్ ఆటగాడిగా వినీషియస్ రికార్డు సృష్టించాడు.

కున్హా మెరుపులు.. నేమార్ పునరాగమనం:
సెకండాఫ్‌లోనూ బ్రెజిల్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 60వ నిమిషంలో గుమారెస్ అందించిన మరో అసిస్ట్‌ను మాథ్యూస్ కున్హా గోల్‌గా మార్చడంతో బ్రెజిల్ 3-0తో తిరుగులేని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ అభిమానులకు మరో తీపి కబురు అందింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ప్లేయర్ నేమార్ 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు.
స్కాట్లాండ్ ఆటగాళ్లు స్కాట్ మెక్‌టోమినే, ఫెర్గూసన్ గోల్స్ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, బ్రెజిల్ గోల్ కీపర్ అలిసన్ వారి ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. బ్రెజిల్ జట్టు ఏకంగా 21 సార్లు గోల్ కోసం ప్రయత్నించి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
టైటిల్ బ్రెజిల్‌దేనా..
ఇక వరల్డ్ కప్ చరిత్రలో బ్రెజిల్ తరఫున గ్రూప్ స్టేజ్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఒకే ఆటగాడు గోల్స్ చేసిన ప్రతిసారీ బ్రెజిల్ ట్రోఫీ గెలవడం విశేషం. ఈ సెంటిమెంట్ ఇప్పుడూ రిపీట్ అవుతుందని బ్రెజిల్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications