FIFA World Cup 2026: తల్లి ప్రేమకు తలొగ్గిన అమెరికా!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేప్ వర్దె గోల్ కీపర్ వోసిన్హా జీవితంలో అద్భుతం జరిగింది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ 40 ఏళ్ల వోసిన్హా అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా ఏడు గోల్స్‌ను అడ్డుకొని స్పెయిన్ విజయవకాశాలను దెబ్బతీసాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, తన అద్భుతమైన ప్రదర్శనను చూసేందుకు స్టేడియంలో తల్లి లేకపోవడంతో మ్యాచ్ అనంతరం వోసిన్హా కన్నీళ్లు పెట్టుకున్నారు. పాస్‌పోర్ట్‌లో తప్పిదాలు, కఠినమైన వీసా నిబంధనల కారణంగా వోసిన్హా తల్లి అనా క్యాండిడా ఎవోరా అమెరికాకు రాలేకపోయారు. తన కొడుకు కనబర్చిన అసాధారణ ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇది ఆమెను కలిచివేసింది. ఈ భావోద్వేగ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా ప్రభుత్వ యంత్రాంగం మానవతా దృక్పథంతో స్పందించింది.

అండగా నిలిచిన అమెరికా యంత్రాంగం
అమెరికా ప్రతినిధుల సభలోని డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ఏ తల్లి కూడా తన కుమారుడు చరిత్ర సృష్టించే క్షణాలను కోల్పోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. దాంతో స్పందించిన ఉన్నతాధికారులు వోసిన్హా తల్లికి అత్యవసర వీసా మంజూరు చేయాలని నిర్ణయించారు.
ఆమె ప్రయాణానికి వీలుగా వీసా ఫీజులను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా.. విదేశాంగ మంత్రిత్వ శాఖే స్వయంగా అన్ని ప్రయాణ ఏర్పాట్లను చూసుకుంది. కేప్ వెర్డే రాజధాని ప్రయీయాలోని యూఎస్ వీసా బృందం నేరుగా ఆమె నివాసానికి వెళ్లి వీసా ప్రక్రియలను సత్వరమే పూర్తి చేయడం విశేషం.
మయామిలో ఆదివారం జరగనున్న ఉరుగ్వే మ్యాచ్‌లో వోసిన్హా బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌ను ఆయన తల్లి అనా క్యాండిడా నేరుగా మైదానం నుంచి వీక్షించనున్నారు. 40 ఏళ్ల వయసులో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న కొడుకును చూసేందుకు ఒక తల్లి తరలిరావడం ఈ ప్రపంచకప్ టోర్నీలోనే అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications