Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026 క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు ఏంటంటే? పూర్తి షెడ్యూల్ ఇదే!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కీలక దశకు చేరింది. లీగ్, ప్రీ-క్వార్టర్స్ దశ దిగ్విజయంగా ముగిసి క్వార్టర్ ఫైనల్స్‌కు తెరలేచింది. లీగ్ దశతో పాటు నాకౌట్ పోరులో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన 8 జట్లు.. క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాయి. నాకౌట్ దశలో సంచలన ఫలితాలు నమోదైన సంగతి తెలిసిందే.

బ్రెజిల్, పోర్చుగల్ వంటి ఛాంపియన్ టీమ్స్‌ను నార్వే, స్పెయిన్ జట్లు మట్టికరిపించాయి. దాంతో ఫుట్‌బాల్ దిగ్గజాలు అయిన నెయ్‌మార్, క్రిస్టియానో రొనాల్డో కలలు చెదిరాయి. కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్ కల నెరవేరకుండానే ఈ దిగ్గజాల ప్రయాణం ముగిసింది.

కలలు సమాధి.. కన్నీటిపర్యంతమైన రొనాల్డో!

కలలు సమాధి.. కన్నీటిపర్యంతమైన రొనాల్డో!

అగ్రరాజ్యం అమెరికాను బెల్జియం మట్టికరిపించగా.. ఈజిప్ట్‌పై అతి కష్టం మీద అర్జెంటీనా గట్టెక్కింది. పెనాల్టీ షూటౌట్‌లో కొలంబియాను ఓడించిన స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్‌ను ఫిఫా అధికారికంగా ప్రకటించింది.

ఫ్రాన్స్, మొరాకో, స్పెయిన్, బెల్జియం, నార్వే, ఇంగ్లండ్, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. శుక్రవారంతో ఈ క్వార్టర్స్ పోరుకు తెరలేవనుంది. మరింత పోటాపోటీగా మ్యాచ్‌లు జరగనున్నాయి.

FIFA World Cup 2026 Quarterfinal Schedule When and Where to Watch Live in India

ఫిఫా క్వార్టర్ ఫైనల్ షెడ్యూల్(భారత కాలమానం ప్రకారం)..

జులై 10(శుక్రవారం): క్వార్టర్ ఫైనల్ 1: ఫ్రాన్స్ X మొరాకో, బోస్టన్ స్టేడియం, తెల్లవారుజామున 1.30 గంటలకు

జులై 11(శనివారం): క్వార్టర్ ఫైనల్ 2: స్పెయిన్ X బెల్జియం, లాస్ ఏంజిల్స్ స్టేడియం, అర్ధరాత్రి 12.30 గంటలకు

జులై 11(శనివారం): క్వార్టర్ ఫైనల్ 3: నార్వే X ఇంగ్లండ్, మయామి స్టేడియం, తెల్లవారుజామున 2.30 గంటలకు

జులై 12(ఆదివారం): క్వార్టర్ ఫైనల్ 4: అర్జెంటీనా X స్విట్జర్లాండ్, కాన్సాస్ సిటీ స్టేడియం, ఉదయం 6.30 గంటలకు

FIFA World Cup 2026‌లో బెట్టింగ్ జోరు.. మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!

FIFA World Cup 2026‌లో బెట్టింగ్ జోరు.. మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!

ఎలా చూడాలంటే..?

ఫిఫా ప్రపంచకప్‌ 2026 టోర్నీకి అధికారిక ఇండియా బ్రాడ్‌కాస్టర్స్‌గా యునైటెడ్ 8 స్పోర్ట్స్, జీ5 ఓటీటీ ఫ్లామ్‌ వ్యవహరిస్తున్నాయి. టీవీలో యునైటెడ్ 8 స్పోర్ట్స్ ఛానెల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌లను నచ్చిన భాషలో ఆస్వాదించవచ్చు.

Story first published: Thursday, July 9, 2026, 10:35 [IST]
Other articles published on Jul 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+