FIFA World Cup 2026: రోనాల్డో లాస్ట్ డ్యాన్స్.. పోర్చుగల్ బలాలు, బలహీనతలు ఇవే!
క్రిస్టియానో రోనాల్డో.. భారత క్రీడా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఫుట్‌బాల్ అనగానే మనవాళ్లకు గుర్తొచ్చే ఆటగాళ్లలో క్రిస్టియానో రోనాల్డో ముందు వరుసలో ఉంటాడు. 41 ఏళ్ల వయసులోనూ అత్యంత ఫిట్‌గా ఉన్న రోనాల్డో తన చివరి ప్రపంచకప్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
జూన్ 11 నుంచి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి తెరలేవనుంది. ఈ టోర్నీలో రోనాల్డో సారథ్యంలోని పోర్చగల్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఏకైక ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో రోనాల్డో ఉన్నాడు. ప్రపంచకప్ గెలిచి తమ దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలకాలని పోర్చుగల్ భావిస్తోంది. మేనేజర్ రాబర్టో మార్టినెజ్ ఆధ్వర్యంలోని పోర్చుగల్ బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం.
బలాలు:
వరల్డ్-క్లాస్ మిడ్‌ఫీల్డ్: బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా వంటి ఆటగాళ్లతో పోర్చుగల్ మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా ఉంది. బ్యాకప్‌గా రూబెన్ నెవ్స్, జోనో నెవ్స్ ఉన్నారు.
నునో మెండిస్, జోనో కాన్సెలో వంటి స్టార్ డిఫెండర్లు డిఫెన్స్ నుంచి అటాకింగ్‌కు జట్టును వేగంగా తీసుకెళ్లగలరు. డీగో డాలోట్, మాథ్యూస్ నూన్స్ వంటి మెరుగైన బ్యాకప్స్ ఉన్నారు.
27 మందితో కూడిన పోర్చుగల్ జట్టులో ప్రతి స్థానానికి ప్రత్యామ్నాయ స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

బలహీనతలు
రోనాల్డో ఇప్పటికీ అత్యుత్తమ గోల్‌స్కోరర్ అయినప్పటికీ, 41 ఏళ్ల వయసున్న ఆటగాడి కోసం ఆధునిక హై-ప్రెసింగ్ శైలిని మార్చడం జట్టు వ్యూహాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
రూబెన్ డయాస్ రూపంలో ప్రధాన డిఫెండర్ ఉన్నప్పటికీ.. అతని వెనుక ఉన్న ఆంటోనియో సిల్వా వంటి యువ ఆటగాళ్లకు హై-ప్రెజర్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం తక్కువ. దాంతో జట్టులో సెంటర్-బ్యాక్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
అవకాశాలు
బ్రూనో ఫెర్నాండెజ్, రూబెన్ డయాస్ తమ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉండగా.. 21 ఏళ్ల జోనో నెవ్స్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు.
గ్రూప్-జె లో డీఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాలతో పోర్చుగల్ తలపడనుంది. నాకౌట్ దశకు ముందు ఫామ్‌ను అందుకోవడానికి ఇది మంచి అవకాశం.
సవాళ్లు / ముప్పు
మీడియా ఒత్తిడి: రోనాల్డో లాస్ట్ డాన్స్ అనే హైప్ వల్ల జట్టుపై విపరీతమైన లైమ్‌లైట్ ఉంటుంది. ఒకవేళ రోనాల్డోను బెంచ్‌కే పరిమితం చేస్తే వచ్చే వివాదాలు జట్టును దెబ్బతీయవచ్చు.
క్లిష్ట సమయాల్లో బంతిని కేవలం స్టార్ ఆటగాళ్లకే పాస్ చేసే పాత అలవాటును ప్రత్యర్థులు సులభంగా అడ్డుకునే ప్రమాదం ఉంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 పోర్చుగల్ జట్టు :
గోల్‌కీపర్లు: డియాగో కోస్టా (పోర్టో), జోస్ సా (వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్), రూయి సిల్వా (స్పోర్టింగ్ లిస్బన్), రికార్డో వెల్హో (గెంచ్లెర్‌బిర్లిగి).
డిఫెండర్లు: రూబెన్ డయాస్ (మాంచెస్టర్ సిటీ), జోనో కాన్సెలో (బార్సిలోనా), డియాగో డాలోట్ (మాంచెస్టర్ యునైటెడ్), నునో మెండిస్ (పారిస్ సెయింట్-జైర్మైన్), నెల్సన్ సెమెడో (ఫెనర్బాంచె), మాథ్యూస్ నూన్స్ (మాంచెస్టర్ సిటీ), గొంసాలో ఇనాసియో (స్పోర్టింగ్ లిస్బన్), రెనాటో వీగా (విల్లారీయల్), టోమస్ అరౌజో (బెన్ఫికా).
మిడ్‌ఫీల్డర్లు: బ్రూనో ఫెర్నాండెజ్ (మాంచెస్టర్ యునైటెడ్), బెర్నార్డో సిల్వా (మాంచెస్టర్ సిటీ), విటిన్హా (పీఎస్‌జీ), జోనో నెవ్స్ (పీఎస్‌జీ), రూబెన్ నెవ్స్ (అల్ హిలాల్), సాము కోస్టా (మల్లోర్కా).
ఫార్వర్డ్స్ / స్ట్రైకర్లు: క్రిస్టియానో రోనాల్డో (అల్ నాసర్), రాఫెల్ లియావో (ఏసీ మిలన్), జోనో ఫెలిక్స్ (అల్ నాసర్), గొంసాలో రామోస్ (పీఎస్‌జీ), పెడ్రో నెటో (చెల్సియా), ఫ్రాన్సిస్కో కాన్సికావో (జువెంటస్), గొంసాలో గుడెస్ (రియల్ సోసీడాడ్), ఫ్రాన్సిస్కో ట్రింకావో (స్పోర్టింగ్ లిస్బన్).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications