FIFA World Cup 2026 ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ.. ఎలా చూడాలంటే..?
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ మూడు దేశాల్లో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. మిలన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన మార్కో బాలిచ్ ఈ 90 నిమిషాల వేడుకలకు దర్శకత్వం వహిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం 2026 ప్రారంభోత్సవ వేడుకలను ఎప్పుడు చూడాలి?
మూడు దేశాల్లో వరుసగా మూడు రోజుల పాటు ఆరంభ వేడుకలు జరగనున్నాయి. భారత అభిమానులు ఈ కింది సమయాల్లో వేడుకలను వీక్షించవచ్చు:
| వేడుక | సమయం (IST) | ప్రారంభ మ్యాచ్ |
|---|---|---|
| మెక్సికో ప్రారంభోత్సవం | జూన్ 11 (గురువారం), రాత్రి 10:30 | మెక్సికో vs సౌతాఫ్రికా |
| కెనడా ప్రారంభోత్సవం | జూన్ 12 (శుక్రవారం), రాత్రి 11:00 | కెనడా vs బోస్నియా అండ్ హెర్జెగోవినా |
| అమెరికా ప్రారంభోత్సవం | జూన్ 13 (శనివారం), తెల్లవారుజామున 5:00 | అమెరికా vs పరాగ్వే |
ఫిఫా వరల్డ్ కప్ 2026: ప్రారంభోత్సవ ప్రదర్శనలు
మెక్సికో సిటీలో జరగనున్న ప్రారంభోత్సవం ఫుట్‌బాల్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలవనుంది. 1970, 1986 ప్రపంచకప్‌లతో పాటు తాజా 2026 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక మైదానం 'ఎస్టాడియో అజ్టెకా' వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రముఖ గ్లోబల్ పాప్ ఐకాన్ షకీరా ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆమెతో పాటు గ్రామీ అవార్డు గ్రహీత, నైజీరియన్ అఫ్రోబీట్స్ సెన్సేషన్ బర్నా బాయ్, టోర్నమెంట్ అధికారిక గీతం 'డై డై' (Dai Dai)ను ప్రదర్శించనున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు అలెజాండ్రో ఫెర్నాండెజ్ మెక్సికన్ జాతీయ గీతాన్ని, టైలా దక్షిణాఫ్రికా జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హాలీవుడ్ స్టార్ సల్మా హయెక్ పినాల్ట్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ 90 నిమిషాల ప్రదర్శనలో జే బాల్విన్, బెలిండా, డానీ ఓషన్, లీలా డౌన్స్, మనా వంటి అంతర్జాతీయ స్థాయి కళాకారులు పాల్గొననున్నారు.
కెనడా, అమెరికాలో అట్టహాసంగా వేడుకలు
మెక్సికో వేడుకల అనంతరం, కెనడా, అమెరికాలో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.
కెనడాలో "కల్చరల్ మొజాయిక్" (జూన్ 12): భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:00 గంటలకు టొరంటో స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. కెనడియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలనిస్ మోరిసెట్ కెనడియన్ జాతీయ గీతాన్ని, అలెక్సాండర్ గాజిక్ బోస్నియా అండ్ హెర్జెగోవినా జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. నటుడు విల్ ఆర్నెట్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. మైఖేల్ బుబ్లే, అలేస్సియా కారా, జెస్సీ రేయెజ్, ఎలియన్నా, వెగడ్రీమ్, విలియం ప్రిన్స్, సంజయ్, బాలీవుడ్ నటి నోరా ఫతేహి తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
అమెరికాలో హాలీవుడ్ తరహా వేడుక (జూన్ 13): భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 5:00 గంటలకు లాస్ ఏంజిల్స్ లోని సో-ఫై స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. మార్కో బాలిచ్ పర్యవేక్షణలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేటీ పెర్రీ, బ్లాక్‌పింక్ లీసా, రెమా, ఫ్యూచర్, అనిట్ట వంటి గ్లోబల్ స్టార్స్ ప్రదర్శనలు చేయనున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ 2026 భారత్‌లో ఎలా చూడాలి?
ఫుట్‌బాల్ అభిమానులు ఈ వేడుకలను, మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు క్రింది వేదికలను ఉపయోగించుకోవచ్చు:
లైవ్ స్ట్రీమింగ్: ఈ పూర్తి వేడుకలు, మ్యాచ్‌లు Zee5 (వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్), Unite8 స్పోర్ట్స్ వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
టీవీ బ్రాడ్‌కాస్ట్: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న "మ్యాండేటరీ షేరింగ్ ఫ్రేమ్‌వర్క్" నిబంధనల మేరకు, దూరదర్శన్ స్పోర్ట్స్ (DD Sports), Unite8 స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో ఈ వేడుకలు, ఎంపిక చేసిన వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

