కలలు సమాధి.. కన్నీటిపర్యంతమైన రొనాల్డో!
ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కల విషాదాంతమైంది. కెరీర్‌లో ఇదే తన చివరి ప్రపంచకప్ అని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే అతనికి తీరని శోకం మిగిలింది. కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ముద్దాడకుండానే అతని అద్భుత ప్రయాణం ముగిసింది.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ ప్రిక్వార్టర్స్ పోరులో స్పెయిన్ 1-0తో పోర్చుగల్‌ను మట్టికరిపించింది. ఈ ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రోనాల్డో కన్నీరు మున్నీరు అవుతూ ఆటకు వీడ్కోలు పలికాడు.
రొనాల్డో కలలు సమాధి
ఐదుసార్లు బాలన్ డి ఓర్ విజేత అయిన 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఇప్పటి వరకు 25 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ(27) తర్వాత అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. ఈ 25 మ్యాచ్‌ల్లో రొనాల్డో 11 గోల్స్ నమోదు చేయడంతో పాటు 2 గోల్స్‌కు అసిస్ట్ చేశాడు. కెరీర్‌లో తీరని లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను గెలవాలనే కసితో 41 ఏళ్ల వయసులో బరిలోకి దిగిన రొనాల్డోకు స్పెయిన్ దిమ్మతిరిగే షాకిచ్చింది.

మెరినో మ్యాజిక్..
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మైకెల్ మెరినో ఆట చివర్లో (91వ నిమిషంలో) గోల్ నమోదు చేసి స్పెయిన్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్‌లో ఇరు జట్లకు గోల్ రాలేదు.
సెకండాఫ్‌లో కూడా ఇరు జట్లు పోరాడాయి. మ్యాచ్ అదనపు సమయానికి దారితీస్తుందనుకున్న తరుణంలో.. 85వ నిమిషంలో డానీ ఓల్మో స్థానంలో మైకెల్ మెరినో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. సరిగ్గా 91వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను మెరినో ఎలాంటి తప్పు చేయకుండా పోర్చుగల్ గోల్‌కీపర్ డియోగో కోస్టాను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు.
ఈ ఒక్క గోల్‌తో స్పెయిన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. 1962లో మెక్సికోపై పెయిరో తర్వాత, ప్రపంచకప్‌లో స్పెయిన్ తరఫున 90వ నిమిషంలో వచ్చిన రెండో లేట్ విన్నర్ గోల్ ఇదే కావడం విశేషం.
లయ తప్పిన పోర్చుగల్..
పోర్చుగల్ జట్టుకు లభించిన అవకాశాలను స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గోల్ పోస్ట్‌కు అడ్డుగోడలా నిలబడ్డాడు. రొనాల్డో కొట్టిన వాలీని సిమోన్ అద్భుతంగా ఆపగా.. నునో మెండిస్ కొట్టిన షాట్ క్రాస్‌బార్‌కు తగిలి వెనుదిరిగింది. మ్యాచ్ సెకండాఫ్‌లో పోర్చుగల్ అటాకింగ్ పూర్తిగా విఫలమైంది. స్పెయిన్ డిఫెన్స్ విభాగాన్ని ఛేదించడంలో వారు తడబడ్డారు.
పోర్చుగల్ ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ రేషియో కేవలం 0.6 కాగా.. స్పెయిన్ 1.77 తో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో స్పెయిన్ ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా 6 మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్ (గోల్ ఇవ్వకుండా) నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ బెల్జియంతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

