FIFA World Cup 2026: మొరాకోపై విజయం.. సెమీస్ చేరిన ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫ్రాన్స్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం అర్దరాత్రి జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను ఓడించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే ఒక గోల్ చేయగా.. డెంబెల్ మరో గోల్ నమోదు చేశాడు. ఈ విజయంతో ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌కు ఫ్రాన్స్ రెండు అడుగుల దూరంలో నిలవగా.. మొరాకో ఇంటిబాట పట్టింది. బోస్టన్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఫస్టాఫ్ గేమ్‌లో మొరాకో పటిష్టమైన డిఫెన్స్ విభాగాన్ని ఫ్రాన్స్ అద్భుతంగా ఛేదించింది. ఆట 10వ నిమిషంలో ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాపే కొట్టిన పెనాల్టీ షాట్‌ను మొరాకో గోల్ కీపర్ యాసిన్ బోనో అద్భుతంగా అడ్డుకున్నాడు.

ఆ తర్వాత వీఏఆర్ సమీక్ష కోసం మ్యాచ్ రిఫరీ 3 నిమిషాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ఆ ఆలస్యం తర్వాత పెనాల్టీ ఇచ్చారు. కానీ ఈ అవకాశం కూడా వృథా అయ్యింది. లూకాస్ డిగ్నే కొట్టిన బంతి పోస్ట్‌ను తాకింది.
అయితే సెకండాఫ్ గేమ్‌లో ఫ్రాన్స్ దుమ్మురేపింది. 60వ నిమిషంలో ఎంబాపే ఒక అద్భుతమైన గోల్ చేసి ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రపంచకప్‌లో ఎంబాపేకు ఇది 8వ గోల్. దాంతో అతను ఆల్‌టైమ్ స్కోరింగ్ జాబితాలో లియోనెల్ మెస్సితో సమంగా నిలిచాడు. 66వ నిమిషంలో ఎంబాపే ఇచ్చిన పాస్‌ను అందుకున్న ఉస్మాన్ డెంబెలె రెండో గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ తర్వాత మొరాకో ఎంత ప్రయత్నించినా గోల్ నమోదు చేయలేకపోయింది.
మరోవైపు స్టార్ ఆటగాడు ఇస్మాయిల్ సైఫారీ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడం మొరాకోకు ఎదురు దెబ్బ. ఆట 83వ నిమిషంలో మొరాకో ప్లేయర్ అచెడిన్ ఉనాహి గోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్ మైక్ మిగ్నాన్ దానిని అడ్డుకున్నాడు. దాంతో ఫ్రాన్స్ విజయం లాంఛనమైంది.
2018లో ఛాంపియన్‌గా.. 2022లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్.. ఈ సారి టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తోంది. వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెమీఫైనల్స్ చేరి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

