Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: ఉత్కంఠకు తెర.. ఇరాన్ ఆటగాళ్లకు అమెరికా వీసాలు

ఉత్కంఠకు తెరపడింది.. అగ్రరాజ్యం అమెరికా పంతం వీడింది. ఫిట్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడేందుకు ఇరాన్ జట్టుకు మార్గం సుగుమమైంది. రాజకీయ ఉద్రిక్తతలు, దౌత్యపరమైన వివాదాల మధ్య ఫిఫా ప్రపంచకప్ 2026లో పాల్గొనే ఇరాన్ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అమెరికా ఎట్టకేలకు వీసాలు మంజూరు చేసింది. లాస్ ఏంజెల్స్‌లో తమ తొలి మ్యాచ్ ప్రారంభానికి కేవలం 10 రోజుల ముందు ఈ వీసాలు లభించడం గమనార్హం.

తీవ్రమైన వీసా వివాదం

ఇరాన్ జట్టుకు వీసాలు ఇంకా రాలేదని మెక్సికోలోని ఇరాన్ రాయబారి అబోల్ఫజ్ల్ పసందిదేహ్ మీడియాకు తెలిపిన కాసేపటికే అమెరికా వీసాలను మంజూరు చేసింది. రాత్రికి రాత్రే వీసాలు మంజూరైనట్లు వైట్ హౌస్ అధికారి ధృవీకరించారు. అమెరికా భూభాగంపై ఇరాన్ ఉనికిని వీలైనంత తగ్గించాలనే ఆలోచనతో వీసాల మంజూరును ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. వీసాల ఆలస్యం కారణంగా ఇరాన్ తన బేస్ క్యాంప్‌ను అరిజోనా (అమెరికా) నుంచి మెక్సికో సరిహద్దులోని టిజువానాకు మార్చుకోవాల్సి వచ్చింది.

FIFA World Cup 2026 Iran Football Team Granted Visas to Enter United States Amid Political Tensions

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు రాజకీయ రంగు..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధ వాతావరణం కారణంగా ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు రాజకీయ రంగు అలుముకుంది. భౌగోళిక రాజకీయ సమరంగా మారింది. 1930లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి, ఒక ఆతిథ్య దేశం తాను యుద్ధం చేస్తున్న దేశ జట్టుకు స్వాగతం పలకడం ఇదే తొలిసారి.

Fifa World Cup 2026: అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా? మెస్సీ టీమ్ బలాలు, బలహీనతలు!

Fifa World Cup 2026: అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా? మెస్సీ టీమ్ బలాలు, బలహీనతలు!

అమెరికా తమ భూభాగంలో ఇరాన్ జట్టు ఉండకూడదని ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అయితే, ఇరాన్ సైనిక విభాగమైన 'రివల్యూషనరీ గార్డ్స్'తో సంబంధం ఉన్న వ్యక్తులను వరల్డ్ కప్ డెలిగేషన్‌లో అనుమతించబోమని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇరాన్ జట్టులోని కొందరు ఆటగాళ్లు అక్కడ నిర్బంధ సైనిక శిక్షణ పూర్తి చేయడమే ఇందుకు కారణం.

మరో ఐదు రోజుల్లో..

జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాల వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 48 జట్లు తలపడనున్నాయి. అన్ని అడ్డంకులను దాటుకుని ఇరాన్ జట్టు ఆదివారం ఉదయం మెక్సికోలోని టిజువానా చేరుకోనుంది.

FIFA World Cup 2026: గెలిచినా ఒరిజినల్ కప్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

FIFA World Cup 2026: గెలిచినా ఒరిజినల్ కప్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?
Story first published: Saturday, June 6, 2026, 13:01 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+