Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: భారత్ అభిమానులకు గుడ్ న్యూస్!

భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌ల ప్రసారాలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. భారత బ్రాడ్‌కాస్టర్ ఎవరా? అనేది మరోవారం రోజుల్లో తెలియనుంది. ఈ విషయాన్ని ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) మాజీ జనరల్ సెక్రటరీ షాజీ ప్రభాకరన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే వారం భారత బ్రాడ్‌కాస్టర్ ఎవరా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని ట్వీట్ చేశారు.

'నిరీక్షణ ముగిసింది. చర్చలు పూర్తయ్యాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 భారత బ్రాడ్‌కాస్టర్ భాగస్వామి గురించి అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడుతుంది. భారత ఫుట్‌బాల్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. చరిత్రలోనే అతిపెద్ద ప్రపంచకప్‌కు సిద్దంగా ఉండండి.’అని ప్రభాకరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

FIFA World Cup 2026 Indian Football Fans May Finally Get Clarity on Official Broadcast and Streaming Rights

జూన్ 12 నుంచి ఫిఫా వరల్డ్ కప్‌ ప్రారంభం కానుండగా.. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్ మినహా అంతర్జాతీయంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను నిర్వాహకులు ఇప్పటికే కేటాయించారు. కానీ భారత్‌లో మాత్రం ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు.

ఫుట్‌బాల్‌కు భారత్‌లో అంతగా ఆదరణ లేకపోడం, మ్యాచ్ టైమింగ్స్ భారత కాలమానానికి భిన్నంగా ఉండటం, ప్రసార హక్కుల ధరలు భారీ స్థాయిలో ఉండటంతో ఏ సంస్థ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసారభారతిలో కనీసం కీలక మ్యాచ్‌లునైనా ఉచితంగా ప్రసారం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే అది తమ బాధ్యత కాదని హైకోర్టులో ప్రసారభారతి స్పష్టం చేసింది. దాంతో భారత్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రసారాలపై అనిశ్చితి నెలకొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ అమ్ముడుకాకపోవడం నిర్వాహకులకు కూడా తలనొప్పిగా మారింది. మీడియా బ్రాడాకాస్టింగ్ రైట్స్ విషయంలో తాము ఏం చేయలేమని ఏఐఎఫ్‌ఎఫ్ స్పష్టం చేసింది. భారీ జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌ను ఫిఫా నిర్వాహకులు వదులుకోలేరని, మ్యాచ్‌లు కచ్చితంగా ప్రసారం అవుతాయని ఏఐఎఫ్‌ఎఫ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఫిఫా లేదా ఏ ప్రసార భాగస్వామి నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాకరన్ ట్వీట్ చేసినట్లు వారం రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తే ఫుట్‌బాల్ అభిమానులకు అంతకుమించిన సంతోషం ఉండదు.

Story first published: Saturday, May 23, 2026, 20:17 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+