Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: జియో హాట్‌స్టార్‌కి షాక్.. ఫిఫా ప్రసార హక్కులు ఆ ఛానల్‌కే!

భారత క్రీడా రంగంలో తిరుగులేని బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగుతున్న జియో హాట్‌స్టార్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను జీ మీడియా సంస్థ సొంతం చేసుకుంది. దాంతో భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను ఎక్కడ చూడాలనే సందిగ్దతకు తెరపడింది.

ఈ ప్రసార హక్కులను తక్కువ ధరకే దక్కించుకోవాలనుకున్న జియో హాట్‌స్టార్ వ్యూహాన్ని జీ మీడియా తిప్పికొట్టింది. ఫిఫా, జీ మధ్య 8 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. 2034 వరకూ భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను జీ సంస్థ టెలీకాస్ట్ చేయనుంది. ఈ కాలంలో ఫిఫాకు సంబంధించిన 34 ఈవెంట్లకు కూడా ఈ సంస్థనే అధికార బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనుంది.

FIFA World Cup 2026 in India Zee Beats JioHotstar to Secure Mega 8-Year Football Broadcast Deal

ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం భారత్‌కు చెందిన వరల్డ్‌కప్ ప్రసార హక్కులను ఫిఫా రూ. 948 కోట్లకు అమ్మాలనుకుంది. కానీ జీ సంస్థ అత్యధికంగా రూ.500 కోట్లకు బిడ్ వేసి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఖతార్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను రిలయన్స్ – డిస్నీ హాట్‌స్టార్ సంయుక్త కంపెనీ అయిన జియో హాట్‌స్టార్‌ ప్రసారం చేసింది.

ఈసారి కూడా రిలయన్స్‌కు చెందిన వైకోమ్‌ 18 సంస్థ హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. రూ.200 కోట్లకు వైకోమ్ 18 బిడ్ వేయాలనుకుంది. కానీ, ఫిఫా యాజమాన్యం అంత తక్కువ బిడ్‌‌కు నిరాకరించింది. చివరకు.. జీ సంస్థ రూ.500 కోట్లకు హస్తగతం చేసుకుంది. అంతేకాదు కొత్తగా నాలుగు ఛానెళ్లను ప్రారంభించినట్టు జీ సంస్థ వెల్లడించింది.

యునైట్ 8 స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, యునైట్ 8 స్పోర్ట్స్ 2, యునైట్ 8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీలను ఆరంభించామని తెలిపింది. సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 జూన్ 11న మొదలవ్వనుంది. అమెరియా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

Story first published: Monday, June 1, 2026, 17:49 [IST]
Other articles published on Jun 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+