FIFA World Cup 2026 ఫైనల్.. ఫ్రీగా ఎలా చూడాలంటే? మ్యాచ్ టైమింగ్స్?
గత నెలన్నర రోజులుగా ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీకి ఆదివారం జరిగే మెగా ఫైనల్‌తో తెరపడనుంది. ఈ టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తుది పోరుకు అర్హత సాధించాయి.
ఇరు జట్లు అద్భుత ప్రదర్శనతో ఓటమెరుగని జట్లుగా ఫైనల్ చేరడంతో విజేత ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వ్యూహాల పరంగా ఇరు జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. టికిటాకా వ్యూహంతో స్పెయిన్.. అటాకింగ్ గేమ్‌తో అర్జెంటీనా హాట్ ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి.

చరిత్ర సృష్టించేందుకు..
సెమీఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించిన స్పెయిన్ రెట్టించిన ఉత్సాహంతో ఉండగా.. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన అర్జెంటీనా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇరు జట్లలో ఏది గెలిచినా సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది.
అర్జెంటీనా గతంలో 1978, 1986, 2022 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పుడు నాలుగో ప్రపంచకప్ టైటిల్‌పై గురిపెట్టింది. ఒకవేళ ఆ జట్టు విజేతగా నిలిస్తే 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్రకెక్కుతుంది.
మరోవైపు స్పెయిన్‌కు ఇది రెండో ప్రపంచకప్ ఫైనల్. గతంలో ఆ జట్టు 2010లో నెదర్లాండ్స్‌ను ఓడించి తమ తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. ఈ సారి విజయం సాధిస్తే స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అరుదైన మైలురాయిగా నిలుస్తుంది.
ఫైనల్ టైమింగ్స్ ఏంటంటే..?
స్పెయిన్, అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం(జూలై 20) అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా, న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియం కెపాసిటీ 80 వేల సీట్లు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆదివారం(జూలై 19)అర్ధరాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరగనుంది.
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
భారత్‌కు చెందిన ఫిఫా ప్రపంచకప్ డిజిటల్ ప్రసారా హక్కులను ZEE5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. ఈ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. టీవీ రైట్స్‌ను జీ సంస్థకే చెందిన యునైట్8 స్పోర్ట్స్‌కు దక్కాయి. యునైట్8 స్పోర్ట్స్ టీవీ ఛానెల్స్‌లో కూడా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రసారమవుతుంది.ఈ రెండు వేదికల్లో మ్యాచ్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌ను భారత అభిమానులను ఉచితంగా చూడవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


