FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో ముప్పు.. షాకింగ్ రిపోర్ట్!
అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ.. ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త రికార్డులకు వేదికగా నిలవనుంది. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండగా.. 16 నగరాల్లో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌తో పర్యవరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందనే నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వాతావరణ శాస్త్రవేత్తలు, నిపుణుల హెచ్చరికల ప్రకారం.. మూడు దేశాల మధ్య జట్లు, అధికారులు, లక్షలాది మంది అభిమానుల సుదీర్ఘ విమాన ప్రయాణాలు చేయనున్నారు. తద్వారా ఈ టోర్నమెంట్ పూర్తయ్యేలోపు దాదాపు 9 మిలియన్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు విడుదలవ్వనున్నాయి. ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత కాలుష్యకరమైన ప్రపంచ కప్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, జూన్, జూలై నెలల్లో ఉత్తర అమెరికాలోని పలు ఆతిథ్య నగరాల్లో ఊహించని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. తీవ్రమైన వేడిమి, ఉక్కపోత వల్ల అటు ఆటగాళ్ల ఆరోగ్యం, ఇటు మైదానానికి వచ్చే ప్రేక్షకుల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ విమర్వలను ఫిఫా తోసిపుచ్చింది. ప్రయాణ భారాన్ని తగ్గించడానికి జట్లను వివిధ ప్రాంతీయ గ్రూపులుగా విభజించామని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నామని సమర్థించుకుంది. అయినప్పటికీ.. పచ్చటి భవిష్యత్తును పణంగా పెట్టి వాణిజ్య ప్రయోజనాల కోసమే టోర్నమెంట్‌ను ఇంతలా విస్తరించాలా? అనే ప్రశ్నలు ప్రకృతి ప్రేమికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతోంది. క్రీడా సంబరాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని క్రీడా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

