FIFA World Cup 2026 ఫైనల్లో కొట్లాట.. అర్జెంటీనా ఆటగాళ్లపై నిషేధం!
అర్జెంటీనా ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఫిఫా సిద్దమైంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా కొట్టుకున్నారు. స్పెయిన్ విజయ సంబరాలు చేసుకుంటుండగా.. ఓటమిని తట్టుకోలేకపోయిన అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఎక్స్‌ట్రా ప్లేయర్ గావిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.
కింద పడేసి తొక్కిన ప్లేయర్..
ఆ తర్వాత ఎరిక్ గార్సియా మెడను పట్టుకొని తోసేసాడు. మరో అర్జెంటీనా ప్లేయర్ నహుయెల్ మోలినా.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రీపై దాడికి పాల్పడ్డాడు. ఇంకో అర్జెంటీనా ప్లేయర్ నికోలస్ ఒటామెండి పలువురు స్పెయిన్ ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో 106 నిమిషంలో అద్వితీయమైన గోల్‌తో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొర్రెస్ కంటే ఈ గొడవే ఎక్కువ చర్చనీయాంశమైంది.

ఈ ఘటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. దాంతో ఫిఫా క్రమశిక్షణ చర్యలకు సిద్దమైంది. అర్జెంటీనా ఆటగాళ్లతో పాటు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) కూడా క్రమశిక్షణా చర్యలను తీసుకునే అవకాశం ఉంది.
3 మ్యాచ్‌లు నిషేధం..
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఫిఫా 'డిసిప్లినరీ అండ్ ఎథిక్స్ ప్రాసిక్యూటర్'ను నియమించింది. అధికారిక మ్యాచ్ నివేదికలు, వీడియోలను పరిశీలించి ఆటగాళ్లపై అభియోగాలను నమోదు చేయాలని ఫిఫా నిర్ణయించింది. ఫిఫా క్రమశిక్షణా నియమావళిలోని ఆర్టికల్ 14 ప్రకారం.. ఆటగాళ్లపై చేయి చేసుకోవడం, పిడి గుద్దులు కురిపించడం, తన్నడం, మోచేతితో కొట్టడం వంటి తీవ్రమైన హింసాత్మక ప్రవర్తనకు పాల్పడితే మూడు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు.
ఫిఫా విచారణ అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లపై కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడే అవకాశం ఉంది. జట్టు ప్రవర్తన సరిగ్గా లేదని నిర్దారణ అయితే.. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కూడా ఫిఫా జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కూడా..
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ అనంతరం కూడా అర్జెంటీనా టీమ్ ఫిఫా నిబంధనలను ఉల్లంఘించింది. ఇరు దేశాల మధ్య రాజకీయంగా సున్నితమైన అంశాన్ని ప్రస్తావిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించింది. ఫాక్‌లాండ్ దీవులు అర్జెంటీనావేనని ఆ బ్యానర్‌పై పేర్కొంది. ఈ ఘటనపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఫాక్‌లాండ్ దీవులు దక్షిణ అట్లాంటిక్‌లోని బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీవి. 1982లో అర్జెంటీనా ఈ దీవులపై దాడి చేయడంతో యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్)తో ఫాక్‌లాండ్స్ యుద్ధం మొదలైంది. 74 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం తర్వాత బ్రిటన్ తిరిగి ఆ దీవులపై నియంత్రణ సాధించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఈ వ్యహారం రాజకీయ అంశంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

