Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2026: ఈ 10 మందిపైనే అందరి కళ్లు!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ అయిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో (జూన్ 11) ఈ సాకర్ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లోని 16 నగరాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 48 జట్లు పోటీ పడుతున్న ఈ మెగా టోర్నీలో నిప్పులు చెరగడానికి 10 మంది స్టార్ ప్లేయర్స్ సిద్దమయ్యారు.

1. లియోనెల్ మెస్సి (అర్జెంటీనా): 38 ఏళ్ల లియోనల్ మెస్సి తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఆరో సారి ప్రపంచకప్‌ బరిలోకి దిగుతున్నాడు. గతేడాది విజేతగా నిలిచిన అర్జెంటీనా టైటిల్‌ను కాపాడుకోవడంలో ఇతనే కీలకం. మెస్సికి ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతను రాణించడంపైనే అర్జెంటీనా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

FIFA World Cup 2026 10 Superstar Players Who Could Steal the Show and Shape Football s Ultimate Spectacle

2. లామిన్ యమల్ (స్పెయిన్): యూరో 2024 విజేత స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల ఈ యువ వింగర్ తన అసాధారణ ప్రతిభతో తొలి ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు.

3. కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్): 27 ఏళ్ల ఈ భయంకరమైన స్ట్రైకర్, 2022 ఫైనల్లో హ్యాట్రిక్ సాధించి గోల్డెన్ బూట్ గెలిచాడు. ఈసారి ఫ్రాన్స్‌ను విజేతగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Fifa World Cup 2026: అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా? మెస్సీ టీమ్ బలాలు, బలహీనతలు!

Fifa World Cup 2026: అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా? మెస్సీ టీమ్ బలాలు, బలహీనతలు!

4. ఎర్లింగ్ హాలాండ్ (నార్వే): 28 ఏళ్ల తర్వాత నార్వేను ప్రపంచకప్‌కు చేర్చిన హాలాండ్, ఐరోపా క్వాలిఫైయర్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి మెగా టోర్నీలో అరంగేట్రం చేస్తున్నాడు.

5. క్రిస్టియానో ​​రొనాల్డో (పోర్చుగల్): 41 ఏళ్ల వయసులో రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ ఆడుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో లోటుగా మిగిలిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని చూస్తున్నాడు.

6. హారీ కేన్ (ఇంగ్లండ్): అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్, టీమ్ ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్ అయిన హారీ కేన్.. తన గోల్స్, నాయకత్వంతో జట్టును గెలిపించేందుకు సిద్ధమయ్యాడు.

7. వినిసియస్ జూనియర్ (బ్రెజిల్): ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత భీకరమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన వినిసియస్.. బ్రెజిల్‌కు ఆరో ప్రపంచకప్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు.

8.ఆంటోయిన్ సెమెన్యో (ఘనా): క్లబ్ స్థాయిలో రాణించి ఘనా జట్టుకు ప్రధాన అటాకర్‌గా మారిన ఈ బహుముఖ ఆటగాడు.. తన తొలి ప్రపంచకప్‌లో జట్టుకు స్ఫూర్తిగా నిలవనున్నాడు.

9. అర్దా గులెర్ (తుర్కియే): రియల్ మాడ్రిడ్ యువ సంచలనం, 21 ఏళ్ల గులెర్ పైనే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తుర్కియే దేశం భారీ ఆశలు పెట్టుకుంది.

10. మహమ్మద్ సలా (ఈజిప్ట్): ఆఫ్రికా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన 33 ఏళ్ల సలా, జాతీయ జట్టుతో పెద్దగా విజయాలు సాధించలేకపోయాడు. బహుశా తన చివరి ప్రపంచకప్ కాగల ఈ టోర్నీలో సత్తా చాటాలని చూస్తున్నాడు.

FIFA World Cup 2026: గెలిచినా ఒరిజినల్ కప్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

FIFA World Cup 2026: గెలిచినా ఒరిజినల్ కప్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?
Story first published: Monday, June 8, 2026, 12:41 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+