Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: మెస్సీ మెరుస్తాడా? ఏడుస్తాడా? నేడే అసలు సిసలు సెమీఫైనల్!

FIFA World Cup 2022: What happened when Argentina and Croatia met last time

దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. హాట్ ఫేవరేట్ అర్జెంటీనా.. సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన క్రొయేషియా నేడు అర్ధరాత్రి 12.30 ప్రారంభమయ్యే సెమీఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే సాకర్‌ స్టార్లు నెయిమార్, క్రిస్టియానో రొనాల్డో కన్నీళ్లతో టోర్నీని వీడగా.. మరో దిగ్గజం వరల్డ్‌కప్‌ కల నేడు కరిగిపోనుంది. మరి అది మెస్సీదా? లేదంటే క్రొయేషియా స్టార్ మోద్రిచ్‌దా? అనేది చూడాలి.

ఫుట్‌బాల్‌లో మేటి ఆటగాడిగా ఎదిగినా.. ప్రపంచకప్‌ కల కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తున్నాడు మెస్సి. ఇప్పుడు చిట్టచివరి ప్రయత్నంలో కప్పును ముద్దాడేందుకు సాగుతున్న అతనితో పాటు అడుగేస్తూ.. దేశాన్ని మూడోసారి విశ్వవిజేతగా నిలపాలనే లక్ష్యంతో ఉంది అర్జెంటీనా. మరోవైపు ఆరో ప్రపంచకప్‌ ఆడుతున్న క్రొయేషియా.. అసాధారణ ప్రదర్శన కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. గత ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో 3-0తో అర్జెంటీనాపై గెలిచిన ఆ జట్టు.. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది.

మెస్సీపైనే ఆశలు..

మెస్సీపైనే ఆశలు..

కోపా అమెరికా టైటిల్‌ గెలిచి.. వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమన్నదే లేకుండా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా షాకిచ్చింది. ఆ ఓటమి నుంచి తేరుకుని, బలంగా పుంజుకుని ఆ జట్టు సెమీస్‌ చేరడంలో కెప్టెన్‌ మెస్సీది కీలక పాత్ర.

ఇప్పటికే నాలుగు గోల్స్‌ చేసిన అతను.. టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సహచరులు రెండు గోల్స్‌ చేయడంలోనూ అతను సాయపడ్డాడు. సెమీస్‌లోనూ జట్టు ఆశలన్నీ అతనిపైనే.

క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో పోరులో ఆటతోనే కాదు మైదానంలో ఆవేశంతోనూ చర్చనీయాంశంగా మారాడు. ఆ జట్టుకు మరో బలం గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌. అల్వరెజ్‌, ఫెర్నాండెజ్‌, అలిస్టర్‌, డి మారియా, మొలీనా కూడా చూడదగ్గ ఆటగాళ్లు. రెండు పసుపు కార్డులు అందుకున్నందుకు గొంజాలో మోంటియల్‌, మార్కస్‌ అకూనా ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నారు.

సంచలన ప్రదర్శనతో..

సంచలన ప్రదర్శనతో..

పట్టుదలే ఆయుధంగా సాగుతున్న క్రొయేషియా.. కప్పు వేటలో అర్జెంటీనాకు అడ్డుగా నిలుస్తోంది. వెటరన్‌ లూకా మోద్రిచ్‌ నేతృత్వంలో క్రొయేషియా ఫుల్‌జోష్‌లో ఉంది. లీగ్‌ దశలో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేక పోయినా.. క్రమంగా గేర్‌ మార్చింది. రౌండ్‌-16లో జపాన్‌పై గెలిచిన మోద్రిచ్‌ సేన.. క్వార్టర్స్‌లో బ్రెజిల్‌ను షూటౌట్‌ చేసింది.

రష్యాలో జరిగిన మెగా ఈవెంట్‌లో అర్జెంటీనాను చిత్తు చేసిన క్రొయేషియాను తేలిగ్గా తీసుకొన్నా.. ఫలితం తారుమారయ్యే అవకాశాలున్నాయి. ఆఖరి నిమిషం వరకు ఆశలు వదులుకోకుండా ఐక్యంగా పోరాడడం క్రొయేషియా ప్లస్‌ పాయింట్‌.

ఓటమి అంచుల నుంచి తప్పించుకొని సెమీ్‌సకు చేరిన క్రొయేషియాలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఎక్స్‌ట్రా టైమ్‌, షూటౌట్‌కు పరిస్థితులు దారితీస్తే.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అర్జెంటీనాకు ప్రతికూల ఫలితం వచ్చే చాన్సుంది. మొత్తంగా చూస్తే మ్యాచ్‌ ఆసాంతం ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచనుంది.

ముఖాముఖి..

ముఖాముఖి..

ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా, క్రొయేషియా రెండుసార్లు తలపడ్డాయి. వీటిలో చెరో మ్యాచ్‌ నెగ్గాయి. 1998లో గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో క్రొయేషియాపై గెలవగా, 2018లో గ్రూప్‌ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేసింది. గతంలో ఐదుసార్లు సెమీస్‌ చేరిన అర్జెంటీనా.. అన్నిసార్లూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రపంచకప్‌ నాకౌట్లో ఈ రెండు జట్లు తలపడుతుండడం ఇదే తొలిసారి. ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాకు ఇది మూడో సెమీస్‌. 1998 (మూడో స్థానం), 2018 (రన్నరప్‌)లో ఆ జట్టు సెమీస్‌ ఆడింది.

Story first published: Tuesday, December 13, 2022, 10:25 [IST]
Other articles published on Dec 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+