Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: ట్యూనీషియా సంచలనం.. ఫ్రాన్స్‌కు బ్రేక్! నాకౌట్ చేరిన ఆసీస్!

FIFA World Cup 2022: Tunisia 1-0 France, Australia 1-0 Denmark

అల్ రయాన్(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ ముంగిట మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ప్రిక్వార్టర్స్ బెర్త్ దక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తమ చివరి లీగ్‌లో అనూహ్యంగా ఓడింది. ఆ జట్టు జోరుకు అనామక ట్యూనీషియా బ్రేక్ వేసి మెగా టోర్నీలో సంచలనం రేపింది. బుధవారం జరిగిన గ్రూప్-డి పోరులో ట్యూనీషియా 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అయితే మరో మ్యాచ్‌లో డెన్మార్క్‌ను ఆస్ట్రేలియా ఓడించడంతో ట్యూనీషియాకు నాకౌట్ బెర్త్ దూరమైంది. అయినా తమ చరిత్రలో చిరకాల గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

బంతిని నియంత్రణలో..

బంతిని నియంత్రణలో..

65 శాతం బంతిని తన నియంత్రణలోనే ఉంచుకున్నా.. ట్యునీసియాతో పోలిస్తే ఫ్రాన్స్‌ ఆటగాళ్లు రెట్టింపు పాస్‌లు అందించుకున్నా.. గోల్‌ కొట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఎంబాపె సహా కొందరు ఫ్రాన్స్‌ ఆటగాళ్లు మంచి అవకాశాలను వృథా చేశారు. ప్రథమార్ధంలో ఫ్రాన్స్‌ స్పష్టమైన పైచేయి సాధించినా.. ఆ జట్టు గోల్‌ కొట్టకుండా ట్యనీషియా రక్షణ శ్రేణి సమర్థంగా అడ్డుకుంది. ఇక ద్వితీయార్ధంలో కొంచెం దూకుడుగా కదిలిన ట్యనీషియా ఆటగాళ్లు 58వ నిమిషంలో మంచి అవకాశం సృష్టించుకున్నారు.

నాకౌట్ ఆశలతో..

నాకౌట్ ఆశలతో..

లైదౌని తెలివిగా బంతిని చేజిక్కించుకుని ఖజ్రికి పాస్‌ అందించగా.. అతను ఇద్దరు ఫ్రాన్స్‌ డిఫెండర్లతో పాటు గోల్‌ కీపర్‌ మందండాను బోల్తా కొట్టించి నెట్‌లోకి బంతిని పంపించడంతో ట్యనీషియా సంబరాలకు అంతే లేకుండా పోయింది. అప్పటికి సమాంతరంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంకా గోల్‌ కొట్టకపోవడంతో ట్యనీషియాకు నాకౌట్‌ దారులు తెరుచుకున్నాయి. అయితే డెన్మార్క్‌పై 60వ నిమిషంలో గోల్‌ కొట్టడం, చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంతో ట్యనీషియాకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ.. మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో ఒక్క గోలూ కొట్టనివ్వకుండా విజయం సాధించడం ట్యనీషియాను సంబరాల్లో ముంచెత్తింది.

చివర్లో హైడ్రామా..

చివర్లో హైడ్రామా..

నిర్ణీత సమయం 90 నిమిషాలు పూర్తయి, ఇంజురీ టైం మొదలయ్యాక ఇంకో నిమిషం ఆటే మిగిలుండగా.. ఫ్రాన్స్‌ స్టార్‌ గ్రీజ్‌మన్‌ ట్యనీషియా బాక్స్‌లో బంతి అందుకుని మెరుపు షాట్‌తో నెట్‌లోకి పంపించేశాడు. దీంతో ట్యనీషియా ఆటగాళ్లు, అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కానీ రిఫరీ రీప్లే కోరగా.. అది ఆఫ్‌సైడ్‌ అని తేలడంతో ఫ్రాన్స్‌ ఖాతాలో గోల్‌ చేరలేదు. మ్యాచ్‌ ట్యనీషియా సొంతమైంది.

ఆసీస్ రెండో సారి..

ఆసీస్ రెండో సారి..

ప్రపంచకప్‌లో ఆరుసార్లు తలపడ్డ ఆస్ట్రేలియా రెండో సారి నాకౌట్ చేరుకుంది. గ్రూప్-డి మరో మ్యాచ్‌లో ఆసీస్ 1-0తో డెన్మార్క్‌పై విజయం సాధించింది. 60వ నిమిషంలో మాథ్యూ లెకీ విన్నింగ్ గోల్ అందించి 2006 తర్వాత ఆసీస్‌ను ప్రిక్వార్టర్స్ చేర్చాడు.

ఈ గ్రూప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు, ఆఖరి మ్యాచ్‌లో ఓటమితో ఫ్రాన్స్.. 6 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా కూడా అన్నే పాయింట్లతో ఉన్నా గోల్ డిఫరెన్స్‌తో రెండో స్థానం సాధించింది. ఒక్కోగెలుపు, ఓటమి, డ్రాతో ట్యునీషియా 4 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టింది. డెన్మార్క్ ఓ డ్రా, రెండు ఓటములతో1(పాయింట్) నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

Story first published: Thursday, December 1, 2022, 12:53 [IST]
Other articles published on Dec 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+