
211 సభ్య దేశాలు..
గత 92 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ప్రస్తుతం 'ఫిఫా' పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఏడాది తర్వాతే వచ్చే ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలు అవుతాయి. దాదాపు మూడేళ్లపాటు ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.

పోటీలో 32 జట్లు..
1978 వరకు 16 జట్లు... 1982 నుంచి 2002 వరకు 24 జట్లు పోటీపడ్డాయి. 2006 నుంచి తాజా ప్రపంచకప్ వరకు 32 జట్లు ప్రధాన టోర్నీలో బరిలో ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా 'ఫిఫా' స్లాట్‌లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఆసియా నుంచి 5... ఆఫ్రికా నుంచి 5... యూరోప్ నుంచి 13... ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 4... దక్షిణ అమెరికా నుంచి 4 స్లాట్‌లు ఉన్నాయి. ఆతిథ్య దేశం ఖతర్ ఆసియా నుంచి కావడంతో ఈసారి ఆసియా స్లాట్‌ల సంఖ్య ఆరు అయింది. 2026 ప్రపంచకప్‌ను 48 జట్లతో నిర్వహించాలని 'ఫిఫా' నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ స్లాట్‌లలో మార్పు చేర్పులు ఉంటాయి. అలా చేస్తే భారత్‌కు మార్గం సులువవ్వనుంది.

ప్రాక్టీస్‌కే రూ. 12 కోట్ల 21 లక్షలు..
విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జట్టుకు కాసుల పంట పండనుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. 2022 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న 32 జట్లకు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అన్ని జట్లకు ముందస్తుగా సన్నాహాల కోసం రూ. 12 కోట్ల 21 లక్షలు(15 లక్షల డాలర్లు) అందజేశారు. మొత్తం 440 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. 2018 రష్యా అతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ప్రైజమనీ 400 మిలియన్ డాలర్లు.
స్థానం ప్రైజ్‌మనీ
విజేత రూ.341 కోట్లు (4 కోట్ల 20 లక్షల డాలర్లు)
రన్నరప్ రూ.244 కోట్లు(3 కోట్ల డాలర్లు)
మూడో స్థానం రూ.219 కోట్లు(2 కోట్ల 70 లక్షల డాలర్లు)
నాలుగో స్థానం రూ.203 కోట్లు(2 కోట్ల 50 లక్షల డాలర్లు)
5-8 స్థానం రూ.138 కోట్లు(కోటీ 70 లక్షల డాలర్లు)
9-16 స్థానం రూ.105 కోట్లు(కోటీ 13 లక్షల డాలర్లు)
17-32 స్థానం రూ.73 కోట్లు(90 లక్షల డాలర్లు)

అవార్డులు ఏంటంటే..?
ప్రపంచకప్ మొత్తం నిలకడగా రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. అందులో ముఖ్యమైనవి...
గోల్డెన్ బాల్: టోర్నీలో ఉత్తమ ప్లేయర్‌కు అందించే అవార్డు. రెండో ఉత్తమ ప్లేయర్‌కు 'సిల్వర్ బాల్'... మూడో ఉత్తమ ప్లేయర్‌కు 'బ్రాంజ్ బాల్' అందజేస్తారు.
గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌కు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి 'సిల్వర్ బూట్'.. మూడో స్థానంలో నిలిచిన వారికి 'బ్రాంజ్ బూట్' ఇస్తారు.
గోల్డెన్ గ్లవ్: టోర్నీలో ఉత్తమ గోల్‌కీపర్‌కు అందించే పురస్కారం.


Click it and Unblock the Notifications














