Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: అర్జెంటినాకు బిగ్ షాక్.. పసికూన చేతిలో ఓడి పరువు తీసుకున్న మెస్సీ టీమ్!

 FIFA World Cup 2022: Saudi Arabia stuns Lionel Messis Argentina

దోహా: ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్ 2022లో హాట్ ఫేవరేట్‌‌గా బరిలోకి దిగిన లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఊహించని ఫలితం ఎదురైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఆ జట్టుకు ప్రపంచ 51వ ర్యాంకర్ సౌదీ అరేబియా ఊహించని షాకిచ్చింది. ఖతర్ లోని లుసాలీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అర్జెంటీనాపై సౌదీ అరేబియాకు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు నాలుగు సార్లు పోటీపడినా రెండుసార్లు అర్జెంటీనా గెలవగా రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఇక అర్జెంటీనా స్ట్రైకర్ లియోనల్ మెస్సీ మెరిసినా ఆ జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది.

గ్రూప్ -సీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధిస్తే.. ఇటలీ రికార్డును సమం చేసేది. 2019 నుంచి తాజా మ్యాచ్ వరకూ వరుసగా 36 మ్యాచ్‌లు గెలిచిన అర్జెంటీనా.. చివరకు తమకంటే తక్కువ స్థాయి కలిగిన సౌదీ అరేబియా చేతిలో ఓడింది. మ్యాచ్ ఆరంభమైన 9వ నిమిషంలోనే అర్జెంటీనా గోల్ కొట్టింది. దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ..పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత కూడా పూర్తి ఆధిపత్యం చెలాయించిన అర్జెంటినా ఫస్టాఫ్ ముగిసేసరికి 1-0తో లీడ్‌లో నిలిచింది.

సెకండాఫ్‌లో సౌదీ అరేబియా ప్రతిఘటించడంతో అర్జెంటీనా వెనకడుగు వేసింది. ఇరు జట్లు బాల్‌పై ఆధిపత్యం చెలాయించడంతో గేమ్ హోరాహోరీగా సాగింది. ఆట 47వ నిమిషంలో సౌదీ అరేబియా ప్లేయర్ అల్ షెహ్రీ గోల్ కొట్టడంతో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. గోల్‌తో సౌదీ ఆరేబియా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అదే జోరు బాల్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆ జట్టు.. అర్జెంటీనా డిఫెండర్లకు చుక్కలు చూపించింది. ఆట 57వ నిమిషంలో సౌదీ ప్లేయర్ సలీమ్ అల్ దవాసరి మరో గోల్ కొట్టి 2-1తో ఆధిక్యాన్ని అందించాడు.

ఆ తర్వా అర్జెంటినా ఎంత ప్రయత్నించినా సౌదీ ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. పదే పదే గోల్ పోస్ట్‌పై దాడి చేసినా.. సౌదీ డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా అడ్డుకుంది. బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించినా.. గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని సంచలన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ లో మెస్సీ గోల్ చేయడం ద్వారా ప్రపంచకప్‌లో క్రిస్టియానో రొనాల్డో గోల్స్ (7) ను సమం చేశాడు. 2006 నుంచి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 20వ వరల్డ్ కప్ మ్యాచ్. అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం మెక్సికోతో ఆడనుంది.

Story first published: Tuesday, November 22, 2022, 19:41 [IST]
Other articles published on Nov 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+