Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2022: నెయ్‌మార్‌ రీఎంట్రీ.. బ్రెజిల్‌కు తప్పని ఓటమి! చొక్కా విప్పి..

FIFA World Cup 2022: Referees act after showing red card to Cameroons Aboubakar vs Brazil

లూసైల్: ఫిఫా ప్రపంచకప్ 2022 గ్రూప్ దశ మరో సంచలనతో ముగిసింది. ఐదు సార్లు చాంపియన్, బలమైన బ్రెజిల్‌‌కు కామెరూన్ షాకిచ్చింది. విన్సెంట్‌ అబూబాకర్‌ (90+2) లేటు గోల్‌తో.. గ్రూప్‌-జిలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కామెరూన్‌ 1-0తో బ్రెజిల్‌కు ఝలక్‌ ఇచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బ్రెజిల్‌ ఈపాటికే నాకౌట్‌ చేరింది. ఈ నేపథ్యంలో రిజర్వు బెంచ్‌ ఆటగాళ్లతో బరిలోకి దిగిన బ్రెజిల్ టీమ్‌.. ఫస్టాఫ్‌లో పదేపదే దాడులు చేస్తూ అవకాశాలు సృష్టించుకొన్నా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది.

సెకండాఫ్‌లోనూ అదే తీరు. దీంతో మ్యాచ్‌ పేలవమైన గోల్‌లెస్‌ డ్రాకు దారితీస్తుండగా.. స్టాపేజ్‌ టేమ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు జిరోమ్‌ ఎన్‌గామ్‌ కొట్టిన క్రాస్‌ను అబూబాకర్‌ హెడర్‌తో గోల్‌లోకి పంపి.. కామెరూన్‌ను 1-0తో గెలిపించాడు. అయితే, గోల్‌ కొట్టిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా అబూబాకర్‌ జెర్సీని తీసేసి సంబరాలు చేసుకోవడంతో రెఫరీ ఎల్లోకార్డు చూపించాడు. అంతకుముందే ఎల్లో కార్డు పొందడంతో అతడు రెడ్‌కార్డుగా మైదానం వీడాడు.

2002 తర్వాత విశ్వకప్‌లో కామెరూన్‌కిదే తొలి విజయం. కాగా, మెగా ఈవెంట్‌లో బ్రెజిల్‌ను ఓడించిన తొలి ఆఫ్రికా జట్టుగా కామెరూన్‌ రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌ విన్నర్‌గా నిలిచిన బ్రెజిల్‌.. ప్రీక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో తలపడనుంది. 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన కామెరూన్‌ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయంతో జట్టుకు దూరమైన నెయ్‌మార్‌.. కామెరూన్‌తో పోరుకు మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్‌కు ముందు సహచరులు సాధన చేస్తుంటే అతనూ బంతితో ఆడాడు. అనంతరం జట్టు డగౌట్‌ వెనకాల స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ వీక్షించాడు. ఆ గాయం కారణంగా గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు దూరమైన అతను త్వరలోనే తిరిగి మైదానంలో పరుగులు పెట్టే అవకాశముంది. మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దిగ్గజం పీలేకు మద్దతుగా బ్రెజిల్‌ అభిమానులు బ్యానర్లు ప్రదర్శించారు.

Story first published: Sunday, December 4, 2022, 9:06 [IST]
Other articles published on Dec 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+