FIFA World Cup 2022: అభిమానుల కరువు.. ఫేక్ ఫ్యాన్స్‌తో అబాసుపాలవుతున్న ఖతర్!

న్యూఢిల్లీ: యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫిఫా ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ సాకర్ సమరానికి తెరలేవనుంది. ఈ 22వ ఎడిషన్‌కు ఖతర్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఫిఫా ప్రపంచకప్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. సాదా సీదా ఫుట్‌బాల్ మ్యాచ్‌లకే ఎగబడే అభిమానులు.. ఈ మెగా టోర్నీని మాత్రం లైట్ తీసుకుంటున్నారట. ఖతర్ కఠిన నిబంధనల నేపథ్యంలో విదేశీ ఫ్యాన్స్ అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారంట. దాంతో ఫిఫా ప్రపంచకప్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఫ్యాన్స్ లేక వెలవెల బోతున్నాయట.
ఫేక్ ఫ్యాన్స్‌తో..
ఈ మెగా టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖతర్ ప్రభుత్వం పరువు కాపాడుకునేందుకు కూలీలకు డబ్బులిచ్చి ఫేక్ ఫ్యాన్స్ తీసుకొస్తుందట.
ఈనెల 20 నుంచి ఖతర్ వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మొదలుకానుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఖతర్ గడిచిన రెండు మూడు నెలలుగా వార్తల్లో నానుతూనే ఉంది. రోజుకో కొత్త వివాదంతో ఖతర్ అబాసుపాలవుతున్నది. స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటాయనే భయంతో వాటిని ఫేక్ ఫ్యాన్స్ తో నింపేయడానికి స్థానిక ప్రభుత్వం సిద్ధమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అర్జెంటీనా, ఇంగ్లండ్, బ్రెజిల్, తదితర దేశాల నుంచేగాక ఖతర్ లో ఉండే స్థానిక వలస కూలీలకు ఫ్యాన్స్‌గా డ్రెస్‌లు వేసి దోహా వీధుల గుండా ఊరేగించినట్టు తెలుస్తున్నది.
మెస్సీకి అభివాదం..
ఈ మేరకు స్థానిక టిక్ టాక్ ఛానెల్స్ లో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. గురువారం లియోనల్ మెస్సీ దోహా ఎయిర్ పోర్టు నుంచి హోటల్ గదికి చేరుకుంటుండగా అక్కడ పలువురు ఫ్యాన్స్ అతనికి అభివాదం చేస్తూ హంగామా చేశారు. ఇదంతా ఖతర్ ప్రభుత్వం డబ్బులిచ్చి చేపించిన కథేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక నవంబర్ 20న ఫిఫా ప్రారంభం సందర్భంగా నిర్వహించబోయే ప్రారంభవేడుకలకు కూడా ఫేక్ ఫ్యాన్స్ దర్శనమివ్వనున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేరళ వారే ఎక్కువ..
స్టేడియాలను ఖాళీగా ఉంటే అంతర్జాతీయంగా తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చినట్టు అవుతుందని భావించిన స్థానిక ప్రభుత్వం..లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన పలు కథనాలు ప్రచారమయ్యాయి. ఇంగ్లండ్ ప్లేయర్లు ఖతర్‌కు చేరుకోగానే వారికి అభివాదం చేస్తూ వారి జాతీయ జెండాలు, జెర్సీలతో ఎదురొచ్చినవారంతా భారత్‌లోని కేరళ వారేనన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

ఓర్వలేకనే ఆరోపణలు..
అయితే దీనిపై ఖతర్ ప్రభుత్వం, సుప్రీం కమిటీ స్పందించాయి. ఇలాంటి ఆరోపణలు చాలా దురదృష్టకరమని తెలిపాయి. ఫిఫా ప్రపంచకప్ చూసేందుకు వివిధ దేశాల నుంచి అభిమానులు తమ దేశానికి వస్తుంటే ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications